హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు,,,దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఓఆర్ఆర్
ప్రగతిపథంలో భాగ్యనగరం దూసుకెళ్లోంది. త్వరలో హైదరాబాద్‌లో ఔటర్ రింగు రైలు ప్రాజెక్ట్ రాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ ఔటర్ రింగు రైలు ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింనట్టు తెలిపారు. ట్రిపుల్ ఆర్ రోడ్డుకు సమాంతరంగానే ఈ ఔటర్ రింగు రైల్ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ట్రిపుల్‌ఆర్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగు రైలును ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టు సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల నిధులు కేటాయించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు.
Home
Unlabelled
హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు,,,దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఓఆర్ఆర్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: