ముస్లింలు ఇబ్రాహీం ప్రవక్త త్యాగ స్ఫూర్తిని అలవర్చుకోవాలిముస్లిమ్ సోదరులకు బక్రీదు పండుగ శుభాకాంక్షలు
జమాఅతె ఇస్లామహింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముహమ్మద్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ముస్లిమ్ సోదరులకు జమాఅతె ఇస్లామహింద్ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్ బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త ఇబ్రహీం జ్ఞాపకార్థం జరుపుకునే బక్రీదు పండుగ త్యాగ స్ఫూర్తిని ప్రతీ ముస్లిమ్ అలవర్చుకోవాలని ఆయన అన్నారు. ఖుర్బానీ అంటే కేవలం జంతువును వధించడమే కాదని మన మనోవాంఛలన్నింటినీ వధించడమే అసలైన ఖుర్బానీ అని ఆయన పేర్కొన్నారు.
త్యాగస్ఫూర్తిని అలవర్చుకున్నప్పుడే ముస్లిములు ఎదుర్కొంటున్న అభద్రతాభావం, అన్ని రకాల భయాందోళనల్ని జయించవచ్చని ఆయన చెప్పారు. వేలాది సంవత్సరాలక్రితం ప్రవక్త ఇబ్రాహీం, ఇస్మాయిల్ (అలైహి)లు అల్లాహ్ పట్ల చూపిన విధేయత, త్యాగాలను అల్లాహ్ చిరస్మరణీయంగా మార్చారని డాక్టర్ ఖాలిద్ జఫర్ గుర్తుచేశారు.
Post A Comment:
0 comments: