హత్యకు ముందే  హత్య విధానంపై ఇంటర్నేట్ లో సర్చ్ చేసిన పూజారి

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన అప్సర హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అప్సర హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్‌లో "How to Kil human being" అని సెర్చ్ చేశాడు హంతకుడు సాయికృష్ణ. ఆ తర్వాత ఈ నెల 3న కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని పూజారి అప్సరను నమ్మించాడు. అదే రోజు ఇద్దరూ కలిసి శంషాబాద్‌కు చేరుకున్నారు. అ తర్వాత తాను టికెట్ బుక్ చేయలేదని చెప్పి గోశాలకు వెళ్తున్నట్టు సాయికృష్ణ చెప్పాడు. రాత్రి 12 గంటలకి సుల్తాన్‌పల్లిలో ఉన్న గోశాల వద్దకు చేరుకున్నారు. కారులో ముందు సీట్లో అప్సర కూర్చోగా.. ఆమె నిద్రలోకి జారుకున్నాక బెల్లం దంచే రాయితో తలపై పదిహేను సార్లు గట్టిగా బాది చంపేశాడు. అనంతరం.. మృతదేహాన్ని కారుపై కప్పే కవర్లో చుట్టేసి కార్లోనే ఉంచాడు. నేరుగా తన ఇంటికి చేరుకొని తర్వాతి రోజు.. మ్యాన్ హోల్‌లో మృతదేహాన్ని పడేశాడు. అనంతరం.. దుర్వాసన వస్తుందేమోనని.. రెండు లారీల ఇసుకను అందులో పోయించాడు. అది కూడా సరిపోదని.. మ్యాన్‌హోల్‌పై సిమెంట్ కాంక్రీట్ వేయించాడు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: