అక్క ప్రేమించలేదని ఆమె తమ్ముడిని హత్య చేసిన ఉన్మాది

నేటి సమాజంలో ప్రేమ పేరుతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. కొమురంభీం జిల్లాలో తిర్యాణి మండలంలోని ఉల్లిపిట్ట గ్రామంలో ఒక బాలుడిని ప్రేమోన్మాది కిరాతకంగా హత్య చేశాడు. అక్క ప్రేమించడం లేదనే కారణంతో ఆమె తమ్ముడిని గొంతునులిమి హత్య చేశాడు. ఈ నెల 1న హత్య చేటుచేసుకోగా.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన దుర్గం అరుణబాయి-శంకర్ దంపతుల రెండో కుమార్తెను అదే గ్రామానికి చెందిన బోర్కెటు తరుణ్(23) గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ ఆమె వెంట పడుతున్నాడు. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని యువతి చాలాసార్లు చెప్పింది. అయినా తరుణ్ వినకుండా ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. యువతి ప్రేమించడం లేదనే కారణంతో కోపం పెంచుకున్న తరుణ్.. ఆమె తమ్ముడు ఉదయ కిరణ్(14)ను హత్య చేశాడు. ఈనెల 1న యవతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నరుణ్ అనే మిత్రుడితో కలిసి తరుణ్ వెళ్లాడు. కిరణ్‌ను గొంతునులిమి చంపేసి అక్కడ నుంచి ఎవరికీ అనుమానం రాకుండా వెళ్లిపోయాడు.

ఉపాధి పనుల కోసం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు.. పూర్తి చేసుకుని తిరిగొచ్చేసరికి కుమారుడు చనిపోయి ఉన్నాడు. వడదెబ్బతో చనిపోయి ఉంటాడని భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే బాలుడిని చంపితే ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదంటూ తరుణ్‌తో వరుణ్ గొడవపడ్డాడు. ఈ విషయం బాధితుడి కుటుంబసభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖననం చేసిన బాలుడిని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. గోంతు నులిమి చంపినట్లు తేలడంతో హత్యగా తేల్చారు. తరుణ్, వరుణ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: