తెలంగాణ సుపరిపాలనలో  స్వర్ణయుగం

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ సుపరిపాలనలో  స్వర్ణయుగం నడుస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సుపరిపాలన దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర విద్యా  శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

తెలంగాణలో సుపరిపాలనలో తెలంగాణలో స్వర్ణయుగం నడుస్తుందని ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడో విసిరేసినట్లుగా ఉన్న రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఒక చోటకు వచ్చేలా సమీకృతా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని నిర్మించి  ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. వికేంద్రీకరణతో ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చి,నూతన జిల్లాలు, డివిజన్లు,మండలాలు,గ్రామ పంచాయతీలు,పోలీస్ స్టేషన్లు,కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అధికార వికేంద్రీకరణతో అధికారుల మీద ఒత్తిడి తగ్గిందని,పారదర్శకత పెరిగిందని,పనులు సులువుగా అవుతున్నాయన్నారు. నాడు నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ శాఖ నేడు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతతో అన్ని రంగాల కన్నా ముందుందన్నారు.రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనువైన వాతావరణం కల్పించటంతో వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.సంక్షేమం లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలుస్తుందన్నారు.3116 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ ను 4116 కు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి,  జైపాల్ యాదవ్,  అడిషనల్ కలెక్టర్లు ప్రతిక్ జైన్,  తిరుపతి రావు , జిల్లా అధికారులు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, హాజరయ్యారు.


 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: