కేసీఆర్‌కు మించిన దళారి ఎవరు,,,వైఎస్ షర్మిల 


కేసీఆర్ పాలనకు సమయం దగ్గరపడిందని ఆయన్ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇక మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై ఆమె తనదైన సెటైర్లు పేల్చారు. 'దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు' అంటూ కేసీఆర్ మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని అన్నారు. కేసీఆర్ అండ్ కో కన్నా.. ఈ దేశంలో దళారి ఎవరు ? అని ఆమె ప్రశ్నించారు.

"3 కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఉద్యమ ఆకాంక్షను నమ్మి చేతుల్లో పెడితే నట్టేట ముంచిన దోపిడీ దొంగలు మీరే కదా. సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరు ? నీళ్లు అని చెప్పి ఫామ్‌హౌజ్‌కి, నిధులని చెప్పి మీ ఖజానాకు, ఉద్యోగాలు అని చెప్పి మీ కుటుంబానికి ఎత్తుకుపోయిన మోసగాళ్లు మీరే కదా. బంగారు తునక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి ఆ సొమ్ముతో దేశ రాజకీయాలు చేసే మీరే ఈ శతాబ్దపు అసలైన దళారులు. బడి నుంచి సాగుబడి వరకు అన్ని ప్రాజెక్టులపై లక్ష కోట్ల కమీషన్లు తిన్న దోపిడీ దారులు మీరే.

పార్టీ కార్యాలయాలకు, అయినోల్లకు అగ్గువకే 30 వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టిన మీ పాలన దళారి పాలన. దొర గుడిని మింగితే ఆయన ఎమ్మెల్యేలు లింగాలనే మింగే దళారులు. కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో రూ. 5 లక్షలు, దళిత బంధులో రూ. 3 లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు రూ.3 లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30 శాతం కమీషన్లు, ఇసుక, మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతి పెద్ద దళారులు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకుని తిరుగుతూ.. ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపించి, పూటకో మాట, గడికో హామీ.. అంటూ మస్త్ మాటలు చెప్పే అసలైన పగటి వేషగాడు కేసీఆర్. ఒకప్పుడు గంజి కేంద్రాలు ఏమో కానీ మీ నియంత పాలనలో గల్లికొక లిక్కర్ కేంద్రాలే మిగిలినయ్. రైతు రాజ్యం ఉందని.. దొరల రాజ్యం నడుపుతూ వెలుగుజిలుగులు వచ్చాయని.. అంధకారంలోకి నెట్టిన మీ దళారి పాలనను బొంద పెట్టే గడియలు దగ్గరపడ్డాయి." అని వైఎస్ షర్మిల ఆక్షేపించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: