దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

దశాబ్ది ఉత్సవాలను మహేశ్వరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. జూన్ 2 వ తేదీ నుండి ప్రారంభం అయ్యే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మహేశ్వరం నియోజకవర్గ అధికారులతో సెక్రటేరియట్ లోని ఛాంబర్ లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 నుండి 22 వరకు జరిగే కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలన్నారు.ప్రతి రోజు జరిగే కార్యక్రమాలలో ఆయా రంగాల్లో నియోజకవర్గము ఈ 9 ఏళ్ల కాలంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు.


రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని,ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలన్నారు.నియోజకవర్గంలోని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని  22 వరకు కొనసాగే కార్యక్రమాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలన్నారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేయాలన్నారు.ఆధ్యాత్మిక దినోత్సవం నాడు దేవాలయాలను,

మసీదులు,చర్చిలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసేలా చూడాలన్నారు.విద్య దినోత్సవం నాడు చేపట్టే కార్యక్రమాలకు సంభందించి ఏర్పాట్లు చేయాలన్నారు.నియోజకవర్గా నికి మంజూరు అయిన నూతన కళాశాలలకు సంభందించిన వివరాలు ప్రజలకు వివరించాలన్నారు.మన ఊరు మన బడి లో భాగంగా పనులు జరుగుతున్న పాఠశాలలతో పాటు ఇతర పాఠశాలలకు మంజరైన నిధుల వివరాలు చెప్పాలన్నారు.జూన్ 20 విద్య దినోత్సవం నాడే విద్యార్థులకు

డ్రెస్సులు,పాఠ్య,నోట్ పుస్తకాలు అందివ్వనునట్లు ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు.పల్లె ప్రగతి,పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలకు వివరించాలని,చెరువుల వద్ద జరుగుతున్న అభివృద్ధి, తదితర వాటిని,ప్రజలకు జరుగుతున్న లబ్దిని ప్రచారం చేయాలన్నారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: