బోనాలకు సేవలందిస్తున్న కుల వృత్తులను....ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి

దేవాలయాల వృత్తిదారుల సంఘం నేతల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాత నగరంలో బోనాలకు విశేష సేవలందిస్తున్న కుల వృత్తులకు ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతి దేవాదాయ శాఖ ముఖ్య సలదారులు కె.వి.రమణాచారిని దేవాలయాల వృత్తిదారుల సంఘం నేతలు కోరారు. ఈ సందర్బంగా పాతబస్తీ బండ్లగూడలో వారు మాట్లాడుతూ.... ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు బోనాల పండుగకు చేసే సేవలు అంతా ఇంతా కాదని వారు పేర్కొన్నారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం తరఫున తమను ఆదుకోనేలా చర్యలు తీసుకోవాలని కె.వి.రమణాచారిని వినతిపత్రం అందజేయడం ద్వారా వారు కోరారు.   తమ సమస్యలు పరిష్కరించి, తమ సేవలకు గుర్తింపు లభించేలా ప్రత్యేకంగా యూనిఫామ్ ను రూపొందించి గుర్తింపు కార్డుల అందజేసి, గౌరవ వేతనం మంజూరు చేయాలని వారు కోరారు.


తమ కులవృత్తులను ఇప్పటికైనా ఆదుకోవాలని వారు విన్నవించుకొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయాల వృత్తిదారుల సంఘం అధ్యక్షులు పేరోజీ మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షులు బరల జగదీష్ గట్టు బాబు, కోశాధికారి గట్టు సుదర్శన్, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ బొడ్డుపల్లి బాలేశ్వర్ బిక్షపతి మల్కాజ్గిరి నరేష్బొ,మ్మరాజు దేవేందర్ గుండ్రా నవీన్ బర్గెల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: