దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ ప్రగతిని చాటి చెబుదాం

పండుగ వాతావరణంలో పల్లెపల్లెకు తెలియజేద్దాం

సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉండదు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ ప్రగతిని పల్లెపల్లెలో చాటి చెబుదామని పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పండుగ వాతావరణంలా ఘనంగా నిర్వహించాలని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడ ఎస్ వై ఆర్ గార్డెన్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో  కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత  సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా మంత్రి మాట్లాడుతూ.... పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు....20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి.  ప్రతి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలి మహేశ్వరం నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో కోట్లాది రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని ఒక్కో రంగంలో సాధించిన

ప్రగతిని గ్రామ గ్రామ న ప్రజలకు వివరించి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించింది.....సంక్షేమంలో, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది......తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదు...కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉండదుఉత్సవాల్లో  పట్టాలు,గొర్రెల పంపిణీ,న్యూట్రిషన్ కిట్లు,హరిత హరం ప్రారంభంతో పాటుగా కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. 

జూన్ 2 నాడు అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ,  అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు.....రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ  చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలి., వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ,ఇతర కళాశాలలు, గురుకుల,సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలి. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సిద్దంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవాలు,రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల గ్రంథాలయాలు,1600 డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభిస్తున్నాం.జూన్ 20 నాడు పాఠ్య పుస్తకాలు,నోట్ పుస్తకాలు, డ్రెస్సులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతితో  జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేసి ప్రత్యేక తీర్మానాలు చేయాలన్నారు.,దేవాలయాలను,మసీదులు, చర్చిలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు ప్రార్ధనలు జరిగేలా చూడాలన్నారు.


కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు,సాగు నీరు తీసుకురావాటానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు.చెరువుల దినోత్సవం నాడు నియోజకవర్గంలోని అన్ని చెరువుల వద్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలి.ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు,రైతు భీమా,వివిధ రకాల పెన్షన్లు,షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి,చెరువుల్లో వదిలిన చేప పిల్లలు,గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని,


అదేవిధంగా పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలి.ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

 





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: