వికారాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు...

ఈ నెల 9 న కుల,చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రారంభం

జిల్లా ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు
(జానో జాగో వెబ్  న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
కుల వృత్తులు,చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తాండూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.... ఆధునికతతో జీవనాధారం భారంగా మారుతున్న వివిధ కులాల వారికి లక్ష రూపాయలు ఇవ్వాలనే గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారని అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9న జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విశ్వ బ్రాహ్మణ,నాయి బ్రాహ్మణ,రజక, కుమ్మరి, మేదరి,వంటి కుల వృత్తులు, చేతి వృత్తులకు కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని, ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కో ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే మృత్సకారులకి, ముదిరాజ్ కులస్తులకు చెరువులో చేపలు వదిలి జీవనోపాధి కల్పించటం,

గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, రజక,బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేసారు., లక్ష రూపాయల సహయంకు సంభందించి ఇటీవలి జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారని,పేద,మధ్యతరగతి ప్రజల సాధకబాధలు తెలిసిన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని,అందరి ఆశీసులు వారికి అందించాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి  పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది,దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంత్రితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: