ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం

24 గంటల్లో జీవో. రెండవ రోజు శంకుస్థాపన

ఇది కేసీఆర్ పాలనలోనే సాధ్యం....మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్  న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

హరితహారం సందర్భంగా సోమవారం నాడు తుమ్మలూరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా 24 గంటల్లోనే(మంగళవారం) 33/11 కెవి ఇండోర్ సబ్ స్టేషన్ కు 7 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ అయింది. రెండవ రోజు బుధవారం నాడు శంకుస్థాపన చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రికార్డ్ నెలకొల్పారు.  ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... 


 అడిగిన వెంటనే మహేశ్వరం నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలందరి తరుపున ధన్యవాదాలు తెలిపారు.  మెడికల్ కళాశాలతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలకు 15 లక్షల చొప్పున,రెండు మునిసిపాలిటీలకు 25 కోట్ల చొప్పున, రెండు కార్పొరేషన్లకు 50 కోట్ల చొప్పున, తుమ్ములూరు గ్రామానికి కోటి రూపాయలతో తెలంగాణ దశాబ్ది కమ్యూనిటీ హల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.


తుక్కుగూడ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు తోడుగా ఫార్మా సిటీ ఏర్పాటు, ఫ్యాబ్ సిటీతో పాటు ఫాక్స్ కాన్ సంస్థ 9 నెలల్లో ఏర్పాటు కానుండటంతో లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని,పెద్ద ఎత్తున కుటుంబాలు ఈ ప్రాంతంలో నివాసం ఉండే అవకాశం ఉన్నందున భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్న మెట్రోను ఈ ప్రాంతానికి  విస్తరించాలని కోరిన వెంటనే అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్  కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.


నాడు ట్రాన్స్ఫార్మర్స్ చెడిపోతే చందాలు వేసుకొని రైతులు ట్రాక్టర్లలో వేసుకొని బాగుచేయించేవారని నేడు విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ అందిస్తుందని అన్నారు.  వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. గతంలో ఒక ప్రభుత్వం వాగ్దానం చేస్తే,  మరో ప్రభుత్వం శంకుస్థాపన,  ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి చేసెదని,


లేకుంటే ప్రతిపక్షాలు శిలాఫలకల వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపే వారని,  కానీ వాగ్దానాన్ని 24 గంటల్లో జీవో,48 గంటల్లో శంకుస్థాపన చేసి నెల నుండి రెండు నెలల్లో  పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవటం గొప్ప విషయం అని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే సాధ్యం అవుతుందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు విద్యుత్ సమస్య తిరుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి,  ఎమ్మెల్సీ దయనంద్ గుప్తా, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి,  ఎంపీపీ రఘుమా రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి,  వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్,  మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ సురేఖ కరుణాకర్ రెడ్డి,  సిఈ,ఎస్ఈ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: