తెలంగాణకు మరో దిగ్గజ కంపెనీ,,,రూ. 225 కోట్లు పెట్టుబడి పెట్టనున్న టీసీఎల్

తెలంగాణ రాష్ట్రంలో  పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ప్రముఖ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ అయిన టీసీఎల్ గ్లోబల్ (TCL Global) తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది. ముందుగా రూ.225 కోట్ల పెట్టుబడితో టీసీఎల్ గ్లోబర్ తన యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కాగా.. ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 500 మందికి పైగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ అయిన టీసీఎల్ గ్లోబర్ ను తెలంగాణకు ఆహ్వానించటం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతున్న నూతన ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో వాషింగ్‌ మెషిన్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్‌లను కూడా ఉత్పత్తి చేసే యోచనలో కంపెనీ ఉన్నట్టు కేటీఆర్ వివరించారు.

ఈ క్రమంలోనే.. టీసీఎల్ గ్లోబల్ ముందుగా రూ.225 కోట్లతో తన మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 500 మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు వివరించారు. భవిష్యత్తులో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్ననాయని మంత్రి తెలిపారు. కాగా.. టీసీఎల్ కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్ ప్రారంభించనున్న రెసోజెట్‌ సంస్థకు ఈ సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: