జాతీయ జెండా చేతబూని తెలంగాణ 2కే రన్ లో,,,

పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరం ఏసీపీ అంజయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్  ను త్రివర్ణ రంగుల బెలూన్లను గాలిలో ఎగురవేసి 2కే రన్ ను విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. మహేశ్వరం నాడు ఎట్లుండేనో నేడు ఎట్లా మారిందో చూడాలన్నారు.  తుక్కుగూడలో 52 కంపెనీలు వచ్చాయని, ఫాక్స్ కాన్ సంస్థ 9 నెలల్లో ఏర్పాటు కానుందని,లక్ష ఉద్యోగాలు రానున్నాయని ఈ ప్రాంతం మరొక హై టెక్ సిటీగా మారనుందన్నారు.


తెలంగాణ పోలీసింగ్ లో అనేక మార్పులు తీసుకువచ్చి,  కమాండ్ కంట్రోల్ నిర్మించి,  శాంతి భద్రతల పరిరక్షణలో ముందుందన్నారు. సమాజంలో పోలీసులు పాత్ర చాలా గొప్పదని, శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులకు నూతన వాహనాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. షీ టీం లు దేశానికి ఆదర్శం అయ్యాయన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సత్పలితాలు సాధించినట్లు తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం అనేక నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ  సుపరిపాలన అందిస్తూన్నారన్నారు. మహేశ్వరంలో నూతన డీసీపీ, ఏసీపీ కార్యాలయాలతో పాటు, కందుకూరు ఆర్డీవో, బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయాలు, నూతన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


 ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీష్, జడ్పీ ఛైర్ పర్సన్ అనిత రెడ్డి,  డీసీపీ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, మునిసిపల్ చైర్మన్ అబ్దుల్ బిన్ సాధి, వైస్ చైర్మన్ ఫర్హా నాజ్,  ,జడ్పీటీసీ జంగారెడ్డి,  మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి,పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.













Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: