జూన్ 2023

 అంతర్ రాష్ట్ర కిడ్నాప్ ముఠా  ఆరెస్ట్

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి (ఐపీఎస్)

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బేతంచెర్ల పోలీస్ స్టేషన్ నందు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బనగానపల్లెకు చెందిన సిహెచ్.వినాయక రెడ్డి.భరత్ కుమార్ రెడ్డి.డ్రైవరు సాయినాథ్ రెడ్డి లను కిడ్నాప్ చేశామని నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే వదిలిపెడతామని నాగిరెడ్డి కి కిడ్నాపర్స్ తెలపడంతో భయపడిన నాగిరెడ్డి తనకు తెలిసిన వారి వద్ద నుండి 4 కోట్లు డబ్బులు జమ చేసుకొని తన మేనల్లుడు శంకర్ రెడ్డి ద్వారా రెండు విడతలుగా అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి వద్ద మరియు కర్నాటక రాష్ట్రము కోలార్ జిల్లా వద్ద కిడ్నాపర్స్ కు 4 కోట్ల రూపాయలు ఇచ్చినా కిడ్నాపర్స్ తన వాళ్ళను విడిచి పెట్టలేదని బేతంచెర్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా బేతంచర్ల పోలీస్ స్టేషన్ నందు CR No. 108/2023 U/Sec 342, 364-A, 386 r/w 34 IPC గా కేసు నమోదు చేయగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి కేసును చాలెంజ్ గా తీసుకొని దర్యాప్తులో భాగంగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ జీ.వెంకట రాముడు మరియు డోన్ డి‌ఎస్‌పి వై.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో, బేతంచెర్ల సి‌ఐ జి.ప్రియతమ్ రెడ్డి, ఎస్సై ఎస్.శివ శంకర్ నాయక్,ప్యాపిలి ఎస్సై సీఎం.రాకేశ్, ఎస్సైలు ఎం.నరేశ్, కె.జగదీశ్వర రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై డి.రమేశ్ రెడ్డి, ఎస్బి ఎస్ఐ కే.ఎన్.హరినాథ రెడ్డి మరియు పోలీసు సిబ్బందితో మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి డోన్ డి‌ఎస్‌పి పర్యవేక్షణలో అదునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనంతపురం, బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగుళూరు, కోలార్, మైసూరు, తుమ్కూర్ మొదలగు ప్రదేశాలలో


తిరిగి కిడ్నాపర్స్ కోసము ముమ్మర గాలింపులు జరుపుతుండగా 29.06.2023 గుత్తి మండలము బాట సుంకులమ్మ గుడి వద్ద సురేశ్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా చేసిన నేరము ఒప్పుకొని మిగిలిన ముద్దాయిల సమాచారం తెలపడంతో అనంతపురము జిల్లా చెన్నేకొత్తపల్లి మండలము, కోన మల్లికార్జునస్వామి గుడికి వెళ్ళు రహదారిలో కర్నాటక రాష్ట్రనికి చెందిన  శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, జి.ఎన్. రంజిత్ కుమార్ లను ఆంద్ర రాష్ట్రము లోని ఉమ్మడి అనంతపురం జిల్లాకి చెందిన  రవి కుమార్,రంజిత్ కుమార్ లను అదుపులోనికి తీసుకొని విచారించగ నేరమును అంగీకరించగా, వారి వద్ద నుండి 40 లక్షల రూపాయల నగదును, నాలుగు కార్లను, మూడు సెల్ ఫోన్ లను మరియు ఒక కత్తిని స్వాదీనము చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో ముద్దాయిలు కేవలము తాము త్వరగా ఆర్ధికముగా స్తిరపడాలనే ఉద్దేశ్యముతో ధనవంతుడైన బనగానపల్లే కు చెందిన వినాయక రెడ్డిని  ఎంచుకొని అతని ఇంటి వద్ద రెక్కి నిర్వహించి పక్క పధకం ప్రకారము 05.06.2023 న వినాయక రెడ్డి సొంత వాహనములో బేతంచెర్ల వైపు వెళ్లడం గమనించి,తాము ముందుగా అనుకున్న పధకం ప్రకారము బేతంచెర్ల మండలము సీతరామపురం మెట్ట దాటిన తరువాత తమ వాహనాలతో అడ్డగించి వినాయక రెడ్డి,కుమారుడు భరత్ కుమార్ రెడ్డి లను మరియు డ్రైవరు సాయినాథ్ రెడ్డి ని కూడా కిడ్నాప్ చేశారని తెలిపారు.

ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని చేదించిన డోన్ డిఎస్పి వై.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో విధులు నిర్వహించిన బేతంచెర్ల సి‌ఐ జి.ప్రియతమ్ రెడ్డి, ఎస్ఐ ఎస్.శివశంకర్ నాయక్, ప్యాపిలి ఎస్సై సీఎం.రాకేశ్, ఎస్సైలు యం.నరేశ్, కె.జగదీశ్వర రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై డి. రమేశ్ రెడ్డి,ఎస్బి ఎస్ఐ కే.ఎన్. హరినాథ రెడ్డి పోలీసు సిబ్బంది దస్తగిరి, గురుబాబు, శ్రీకాంత్, రాజ, భాస్కర్, సురేష్, చిన్న వెంకటేశ్వర్లు, హెచ్జీ విశ్వేశ్వరయ్య, జాకీర్, ఐటి కోర్ టీం మధు, శేఖర్ లను జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి అభినందించారు.

 పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని... 

నందికొట్కూరు సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని స్థానిక నందికొట్కూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు పకీర్ సాబ్ అధ్యక్షతన స్థానిక సిపిఎం కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా పాత బస్టాండ్ పటేల్ సెంటర్ మీదుగా విద్యుత్ సబ్స్టేషన్ చేరుకొని పెరిగిన విద్యుత్ బిల్లులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పెంచిన విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ ట్రూ అప్ సర్దుబాటు చార్జీలు వసూలు నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్ లను పెట్టరాదని,డిస్కములను ప్రైవేటీకరన చేయరాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై గత సంవత్సరం కరెంటు చార్జీలు పెంచి 1400 కోట్ల రూపాయలు భారం ప్రజలపై మోపిందని,మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకే జగన్ ప్రభుత్వం ప్రతినెల కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని,కరెంట్ బిల్లులో ఫిక్స్ చార్జీలు, కస్టమర్ చార్జీలు,సర్ చార్జీలు,విద్యుత్ సుంకం, సర్దుబాటు చార్జీల పేర్లు పెట్టి ప్రజల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని,


గతంలో తెలుగుదేశ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఆదేశాలకు లొంగి విద్యుత్ రంగాన్ని మూడు ముక్కలు చేసి సంస్కరణల పేరుతో చార్జీలు పెంచితే కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడి ప్రాణ త్యాగాలు చేసి పోరాడారని,కాంగ్రెస్ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి  ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిరాహార దీక్ష చేశారని కానీ ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలు తిరస్కరించిన విధానాలనే అమలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని,తక్షణమే విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే మరో విద్యుత్ ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బెస్తరాజు, గోపాలకృష్ణ,ఎం కర్ణ, రంగమ్మ,సాజిదాబి,ప్రజా సంఘాల నాయకులు రాము,సురేష్,నరసింహులు,రామిరెడ్డి,శివ, నారాయణ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.


 హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికిి,,,పట్టువస్త్రాల సమర్పణ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం 75వ బోనాల వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజు ఆలయ కమిటీ అధ్వర్యంలో మిరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయంలో, అలిజాకోట్ల శ్రీ కోట మైసమ్మ దేవాలయంలో అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ సభ్యులు చేతన్ కుమార్ సూరి, దిక్షిక సూరి, ఎం.ముఖేష్ యాదవ్ కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్, సలహాదారులు జి.రాజారత్నం, ఆవుల భారత్ ప్రకాష్, కార్యదర్శి కె.దత్తాత్రేయ, ప్రతినిదులు ఎస్.పి.క్రాంతి కుమార్, జగ్మోహన్ కపూర్, ఏ.రజత్, అజయ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా దేవాలయాల ప్రతినిదులు గాజుల అంజయ్య, జి.రాహుల్,  శ్రీధర్ యాదవ్, బాబు రావు, పి.వెంకటేష్ తదితరులు అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ ప్రతినిధులకు అమ్మవారి ప్రసాదం అందచేసి సత్కరించారు.

 గ్రామ పంచాయతీ భవనాలకు రూ. 80 లక్షలు మంజూరు

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదలు తెలిపిన సర్పంచ్ లు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం,  కందుకూరు మండలాల్లోని 4 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు  రూ. 80 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసారు. మహేశ్వరం మండలం గంగారాం,  నందుపల్లిలలో, కందుకూరు మండలం అన్నొజిగూడా, బేగరి కంచ గ్రామాలకు 20 లక్షల చొప్పున పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయి.  నిధులు మంజూరు చేయించినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆయా గ్రామాల సర్పంచ్లు ధన్యవాదాలు తెలిపారు.

 పోడు కేసులు ఎత్తేస్తాం,,,,గిరిజనులకు సీఎం కేసీఆర్ అభయం

పోడు రైతులపై గతంలో నమోదైన పోడు కేసులన్నీ ఎత్తేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పోడు రైతులకు ఈ సారి నుంచే రైతుబంధు అమలు చేస్తామని చెప్పారు. కుమురంభీం ఆసిఫాబాద్ నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం.. నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పోడు భూముల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మంది పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతుందని.., స్వరాష్ట్రం సాధించుకున్నాం కాబట్టే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చిందని వ్యాఖ్యనించారు. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలలో సీజనల్ వ్యాధులు ప్రబలేవని నేడు.. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించటంతో వ్యాధులు లేవని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపంచారు. జిల్లాలోని నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల వ్యవసాయ పొలాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కౌటాల మండలం నుంచి వార్దా నది మీదుగా మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 75 కోట్ల మంజూరు చేస్తామన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి చర్యలు చేపడుతామని అన్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, కాగజ్‌నగర్, అసిఫాబాద్ మున్సిపాలిటీలకు చెరో రూ. 25 కోట్ల చొప్పున సీఎం ప్రత్యేక ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు కూడా ఇదే వేదికపై నుంచి సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు. జిల్లాలోని7 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, 311 గ్రామపంచాయితీలకు తలా రూ. 10 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు.

ధరణి మంచి స్కీమ్ అని.. కాంగ్రెస్ నేతలు మాత్రం ధరణి రద్దు చేస్తామని చెబుతున్నారన్నారు. ధరణి పోతే మళ్లీ పైరవీకారులే వచ్చి దోచుకుంటారన్నారు. ధరణి ఉంటేనే మనకు లాభమని.. ధరణి వల్లే రైతు బీమా అందుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన మంచినీరు, ప్రజల ఆరోగ్యం, పేద పిల్లలకు మంచి విద్య, ప్రజలకు సుపరిపాలన అందించటమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీం నినదించిన ఈ జిల్లా నుంచే పోడు పట్టాలు పంపిణీ చేయటం సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు.


 గిరిజన పక్ష పాతి సీఎం కేసీఆర్

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన  మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....


వికారాబాద్ జిల్లాలో 436  మంది లబ్దిదారులకు 553  ఎకరాల భూమిపై హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులు సాగు చేస్తున్న పొలంలో భయం పోగొట్టి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్  అతి గొప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆదేశానుసారం గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా  చేపడుతున్నట్లు తెలిపారు.


గిరిజన జాతి చరిత్రలో పోడు పట్టాల పంపిణీ సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భమని లక్షా యాభై ఒక్క వేల మంది ఏకకాలంలో 4 లక్షల ఎకరాలకు భూ యజమానులు కాబోతున్నారన్నారు. ఈ సందర్భంగా వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన పక్ష పాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ క
లుస్తున్నారని,అనేక సమీక్షలు చేసి,అనేక మందితో చర్చించి పోడు భూముల పట్టాల నిర్ణయంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.అడవులను కాపాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా సీఎం కేసీఆర్‌ పోడు రైతులకు పట్టాలు ఇస్తున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.  తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వాటన్నింటిలో పోడు రైతులకు పట్టాలు అతి గొప్ప నిర్ణయం అన్నారు.

 అదే విధంగా మా తండాలో మా పాలనే అన్న నినాదాన్ని సాకారం చేస్తూ 500 జనాభా ఉన్న 3 వేల పై చిలుకు తాండలకు గ్రామ పంచాయతీలుగా మార్చటంతో ఆయా గ్రామాల్లో వారే  సర్పంచ్లుగా ఉన్నారన్నారు.వికారాబాద్ జిల్లాలోని తండాలలో కనీస సౌకర్యాల కల్పనకు 15 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.100 యూనిట్ల లోపు విద్యుత్ వాడే ఎస్ సి,ఎస్టీలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు.వికారాబాద్ జిల్లాలో 7 వేల ఇళ్లకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.సేవాలాల్ మహరాజ్ గారి  జయంతి,వర్థంతి లను  అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.బంజారాల పేరు మీద ఉన్న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోనే బంజారా భవన్ నిర్మించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చి పూర్తి చేసి బంజారా ఆత్మగౌరవ భవనం పూర్తి చేయించారన్నారు.


రెండు కోట్లతో వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గ లలో బంజారా భవన్ లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.దేశంలో ఎక్కడలేని విధంగా ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై1లక్ష 25 వేలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తూ విద్యార్థుల విదేశీ విద్య కలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాకారం చేస్తున్నారన్నారు.ఎస్టీలకు రిజర్వేషన్ కోసం పీఎం మోడీ గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగుతున్న స్పందించడం లేదని,అయిన కూడా 10 శాతం రిజర్వేషన్లు  గిరిజనులకు తెలంగాణ లో ముఖ్యమంత్రి గారు ఇచ్చారన్నారు.విద్యాలయాల్లో సీట్లతో పాటు,ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించారన్నారు.పోడు భూముల పట్టాలు పొందిన రైతులకు  రైతుబంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని,ఈ వానాకాలంకు సంభందించి రైతు బంధు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు అందించిన  చరిత్రలో లేదని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసిందని,అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ కమిటీలను వేసి అర్హులైన పోడు రైతులను గుర్తించి నేడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందన్నారు.నేటి నుండి రాష్ట్రంలోని 4,05,601 ఎకరాల అటవీ భూమిని 1,50,012 మందికి అందించనున్నారన్నారు.పాలిగన్‌  సాంకేతిక సహాయంతో పకడ్బందీగా పోడుభూముల పట్టా (అటవీ భూ యాజమాన్య హక్కు ప్రతాలు)ను రూపొందించిందన్నారు. భూమి సర్వే నంబర్‌, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్‌ మ్యాపింగ్‌ వివరాలతోపాటు హోలోగ్రామ్‌ను అటవీ భూ యాజమన్య హక్కు పత్రంలో పొందుపరచడం జరిగిందన్నారు. దీంతో పంపిణీ చేసిన భూమి ఇరుగుపొరుగుతో భూ వివాదాలు లేకుండా చేస్తుందని మంత్రి తెలిపారు.భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మూడు శాఖల అధికారుల సమన్వయంతో పక్కాగా యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామన్నారు.


వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కలెక్టర్ నారాయణరెడ్డి,  ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్,  కొప్పుల మహేశ్వర రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా మండలాల జడ్పీటీసీ, ఎంపీపీలు, గిరిజనులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

 గడ్డపారతో డోర్ పగలగొట్టి,,,బ్యాంకుకు కన్నం వేసేందుకు బాలుడి యత్నం

మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ బుడ్డోనికి ఏం అవసరమొచ్చిందో... లేదా సినిమాల ప్రభావమో.. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశాడు. దోచుకునేందుకు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకును ఆ పిల్లాడు ఎంచుకున్నాడు. మొదట ముసుగు దొంగలా వెళ్లి పరిసరాలు పరిశీలించిన ఆ పిల్లాడు.. ఆ తర్వాత మాత్రం.. దర్జాగా గడ్డపార, కర్రలు తీసుకొచ్చుకున్నాడు. అయితే. మెయిన్ డోర్ ద్వారా వస్తే అందరికీ తెలిసిపోతుందనుకున్నాడో.. లేక తీయటం తన వల్ల కాదని తలచాడో కానీ.. ప్రక్కన ఉన్న మరో డోర్‌ను పగలగొట్టేందుకు పూనుకున్నాడు.

గడ్డపారతో తాళం పగలగొట్టేశాడు. డోర్ తెరిచాడు. కానీ.. ఎలాంటి దొంగతనం చేయకుండా ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోయాడు. ఆ బుడ్డోడికి భయం అయ్యిందో.. లేదా లోపల డబ్బు ఎక్కడ ఉంటుందో తెలియదో.. ఇంకేదో కానీ.. మొత్తానికి ఎలాంటి దొంగతనం చేయకుండానే వెళ్లిపోయాడు. కానీ.. చోరికి తెచ్చిన గడ్డపార, కర్రలు అక్కడే వదిలేసి పోయాడు. ఇంత చేసిన పిల్లాడు.. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి.. తాను చేసే పని అందులో రికార్డవుతుందన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంక్ సిబ్బంది.. బ్యాంకు వద్దకు చేరుకొని పరిశీలించారు. చోరీకి వీలుపడకపోవడంతో వెళ్లిపోయారని ముందుగా అనుకున్నారు. అయితే.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల విజువల్స్ చూస్తే అసలు విషయం బయటపడింది. అయితే.. బాలుడు రాత్రి 8.20 గంటలకు తాళం పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే.. బ్యాంకులో ఉన్న నగదు, బంగారం భద్రంగా ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే.. ఆ పిల్లాడు.. నిజంగానే బ్యాంకు దోచుకునే ఉద్దేశంతోనే వచ్చాడా.. లేదా సరదాకు చేశాడా.. ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. అందుకు చెప్పుకోవాల్సిన ఉదహరణలు కోకొల్లలు. టెక్నాలజీ పెరిగిపోతున్న ప్రపంచంలో అబ్బురపరిచే నాలెడ్జితో కొందరు, చిన్నవయసులోనే గ్రాస్పింగ్ పవర్‌తో మరికొందరు, యునిక్ టాలెంట్‌తో ఇంకొందరు ఇలా ఎవరికివారే సాటి అనేలా.. పిల్లలు హ్యాట్సాఫ్ చెప్పించుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. అటు క్రైంలలో కూడా పిల్లలు తామేమి తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. అందుకు సాక్ష్యమే.. మొన్నీ మధ్య జరిగిన హైదరాబాద్ కిడ్నాప్ కేసులో ఎవరికీ అనుమానం రాకుండా ఓ బాలుడు కథ నడిపించటమే. ఆ ఘటనలో అంటే.. పెద్ద వాళ్లు కూడా తోడున్నారు ఏదో వాళ్లు చెప్పింది చేసాడు అనుకుందాం. కానీ ఇక్కడ మాత్రం మరో పిల్లాడు మాత్రం తాన వయసుకు మించిన పని చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ బుడ్డోనికి ఏం అవసరమొచ్చిందో... లేదా సినిమాల ప్రభావమో.. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశాడు. దోచుకునేందుకు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకును ఆ పిల్లాడు ఎంచుకున్నాడు. మొదట ముసుగు దొంగలా వెళ్లి పరిసరాలు పరిశీలించిన ఆ పిల్లాడు.. ఆ తర్వాత మాత్రం.. దర్జాగా గడ్డపార, కర్రలు తీసుకొచ్చుకున్నాడు. అయితే. మెయిన్ డోర్ ద్వారా వస్తే అందరికీ తెలిసిపోతుందనుకున్నాడో.. లేక తీయటం తన వల్ల కాదని తలచాడో కానీ.. ప్రక్కన ఉన్న మరో డోర్‌ను పగలగొట్టేందుకు పూనుకున్నాడు.

గడ్డపారతో తాళం పగలగొట్టేశాడు. డోర్ తెరిచాడు. కానీ.. ఎలాంటి దొంగతనం చేయకుండా ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోయాడు. ఆ బుడ్డోడికి భయం అయ్యిందో.. లేదా లోపల డబ్బు ఎక్కడ ఉంటుందో తెలియదో.. ఇంకేదో కానీ.. మొత్తానికి ఎలాంటి దొంగతనం చేయకుండానే వెళ్లిపోయాడు. కానీ.. చోరికి తెచ్చిన గడ్డపార, కర్రలు అక్కడే వదిలేసి పోయాడు. ఇంత చేసిన పిల్లాడు.. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి.. తాను చేసే పని అందులో రికార్డవుతుందన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంక్ సిబ్బంది.. బ్యాంకు వద్దకు చేరుకొని పరిశీలించారు. చోరీకి వీలుపడకపోవడంతో వెళ్లిపోయారని ముందుగా అనుకున్నారు. అయితే.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల విజువల్స్ చూస్తే అసలు విషయం బయటపడింది. అయితే.. బాలుడు రాత్రి 8.20 గంటలకు తాళం పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే.. బ్యాంకులో ఉన్న నగదు, బంగారం భద్రంగా ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే.. ఆ పిల్లాడు.. నిజంగానే బ్యాంకు దోచుకునే ఉద్దేశంతోనే వచ్చాడా.. లేదా సరదాకు చేశాడా.. ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.


 హైదరాబాద్‌కు తర్వలోనే ఔటర్ రింగ్ రైలు,,,వాటివల్ల ఉపయోగాలెన్నో

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భద్రతా ప్రమాణాలు, మెరుగైనా రవాణా సదుపాయాలు కల్పిస్తూ.. ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వస్తున్నారు. అంతేకాదు విదేశాల నుంచి పెట్టుపడులు వెల్లువలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటి దాటినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. గతంలో కంటే ఇప్పుడు నగరం నలువైపులా సుమారు వంద కిలోమీటర్ల మేర విస్తరించింది. అయితే.. నగరానికి మెట్రో వచ్చాక ప్రజా రవాణా తీరే మారిపోయింది. అందుకు ప్యార్‌లల్‌గా రైల్వే, ఆర్టీసీ సేవలను కూడా విస్తరించినట్టయితే.. హైదరాబాద్ విశ్వనగరంగా మారటం ఎవ్వరూ ఆపలేరు.

ఇదిలావుంటే అందులో భాగంగానే ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభమైంది. మరోవైపు.. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కూడా పునర్నిర్మితమవుతోంది. ఇదంతా ఒకఎత్తయితే.. తాజాగా హైదరాబాద్‌లో సుమారు 26 వేల కోట్లతో ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్టు చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించటం విశేషం. అందుకు రైల్వేశాఖ సన్నాహాలు కూడా ప్రారంభించినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఈ ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు గనకా అందుబాటులోకి వస్తే.. నగరంలోకి దూర ప్రాంత రైళ్ల రాక తగ్గి.. ఎంఎంటీఎస్‌ రైళ్ల పరుగులు ఊపందుకుంటాయని నిపుణులు చెప్తున్నారు.. 5 నుంచి 10 నిమిషాలకు ఒక రైలు పట్టాల మీద పరుగులు పెట్టే అవకాశముంటుందని చెప్తున్నారు.

అయితే.. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ సెకండ్ ఫేస్‌ను ఏప్రిల్‌ 8న పీఎం మోదీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే నగరంలో 95 కిలోమీటర్ల మేర విస్తరించిన ఎంఎంటీఎస్‌.. రెండో దశ పనులు 2024 జనవరికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే.. కొత్తగా వస్తున్న ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్టుతో ఎంఎంటీఎస్‌ రెండో దశ మరింత విస్తరించేందుకు అవకాశం ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు. ఘట్‌కేసర్‌ తర్వాత యాదాద్రి, జనగామ, మేడ్చల్‌ తర్వాత మనోహరాబాద్‌, తూప్రాన్‌, తెల్లాపూర్‌ తర్వాత రావులపల్లి, వికారాబాద్‌, ఉందానగర్‌ తర్వాత షాద్‌నగర్‌, జడ్చర్ల వరకు.. ఎంఎంటీఎస్‌ సేవలను పొడిగించాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రజల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. కాగా.. ఒకవేళ ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాత్రం ఈ విస్తరణ కూడా జరిగే ఛాన్స్ ఉంది.

అయితే.. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న అన్ని రూట్లను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా అన్ని చోట్ల జంక్షన్లు నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. ఇలా చేయటం వల్ల.. దూర ప్రాంతాల రైళ్లు నగరంలోకి రాకుండా శివార్లలో ఆగి.. అటు నుంచి అటే వెళ్లిపోతాయి. దీంతో.. నగరంలోని స్టేషన్లు, రైల్వే లైన్లు ఫ్రీ అవుతాయి. ఫలితంగా ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒక ఎంఎంటీఎస్‌ రైలు నడపేందుకు వీలు ఉంటుంది. అటు శివార్లలో ఉండే ప్రజలు నగరానికి వచ్చేందుకు.. నగరానికి వచ్చిన జనాలు తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.


 ప్రపంచంతో తెలంగాణ విద్యార్థి పోటీపడేలా చేయడమే కేసీఆర్ ధ్యేయం

ఆధునిక  వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలలో అమెజాన్ సంస్థ  వారి సహకారంతో కల్పించిన  ఆధునిక  వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.  బోనాలు,  పోతారాజుల విన్యాసాలు, కోలాటాలు, డప్పులు వాయిస్తూ మంత్రితో పాటు అమెజాన్ ప్రతినిధులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.  గిరిజన మహిళలతో కలిసి విదేశాల నుండి వచ్చిన అమెజాన్  ప్రతినిధులు నృత్యం చేసారు.


థింక్ బిగ్ స్పేస్- సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్,డైనింగ్ హాల్, కిచెన్ షెడ్,టాయిలెట్స్,15 స్పోర్ట్స్ కిట్స్, కంప్యూటర్  ల్యాబ్ కొసం 5 ల్యాబ్ టాప్ లు, సభా వేదిక, క్రీడా ప్రాంగణం ఆధునికరణ తదితర ఆధునిక సౌకర్యాలు కల్పించి పాఠశాలలను తీర్చిదిద్దిన అమెజాన్ సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. మన ఊరు మన బడి స్పూర్తితో పాఠశాలల అభివృద్ధికి అమెజాన్ సంస్థ ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. 


మన ఊరు మన బడి-మన బస్తీ మన బడిలో భాగంగా సకల హంగులతో,12 రకాల సౌకర్యాలతో  రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దిన 1000 పాఠశాలల లాగే నెదనురు పాఠశాలకు సకల హంగులు వచ్చాయని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు,టెక్స్ట్,మరియు నోట్ పుస్తకాలు, రాగి జావా,ఉపాద్యాయులకు ట్యాబ్ లు అందిస్తున్నామన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు 136 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, 190 కోట్లతో  ఉచితంగా టెక్స్ట్ బుక్స్,సంవత్సరానికి  35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారన్నారు.


12 లక్షల మంది విద్యార్థులకు 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్ , 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 20000  వేల మంది టీచర్స్ కు నేడు అందిస్తున్నట్లు తెలిపారు.మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 9123 పాఠశాలలో  3497.62 కోట్లతో పనులు చేపట్టి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దాదాపు 1000 పాఠశాలలను ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించినట్లు తెలిపారు.రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మన ఊరు మన బడి లో భాగంగా అభివృద్ధి చేస్తామన్నారు.

పెద్ద ఎత్తున విద్యా రంగానికి నిధులు కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి  ధన్యవాదాలు తెలిపారు.అన్ని సౌకర్యాలు కల్పిస్తే అధ్బుతమైన విజయాలు సాధిస్తారని,ఇప్పటికే మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణ పేరును చాటుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణా విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలా తయారు కావలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాలో 6 కోట్లతో  టెక్స్ట్ బుక్స్,10 కోట్ల 50 లక్షలతో 1.65లక్షల మంది  రెండు జతల యూనిఫామ్ లు,5 కోట్ల విలువ చేసే 72 వేల మంది విద్యార్థులకు నోట్ బుక్స్,18.15 లక్షలతో రాగి జావా 1.6 కోట్ల విలువ చేసే 1058 ఉపాద్యాయులకు ట్యాబ్ లు పంపిణీ చేసారన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 ఏళ్ల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు.1200 కి పైగా గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్ష 20 వేలు వెచ్చిస్తుందన్నారు.దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు


,డిజిటల్ తరగతి గదులు కూడా ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా రాగి జావా అందించారు.ఈ కార్యక్రమంలో  జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి గారు,అమెజాన్ గ్లోబల్ హెడ్ కార్నలియ రాబిన్సన్ గారు,డేటా సెంటర్ డైరెక్టర్ సాజి పి కె గారు, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు,ఎంపీపీ జ్యోతి గారు,సర్పంచ్ రామకృష్ణ రెడ్డి గారు,డి ఈ ఓ సుశీందర్ రావు గారు,ఉపాద్యాయులు, విద్యార్థులు,పేరెంట్స్,అమెజాన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
  శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో,,,,

బోనాల ఉత్సవాల్లో విషిష్ట సేవలను అందించిన ప్రముఖులకు

జులై మూడవ తేదీన  అవార్డుల ప్రధానం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జులై 3 వతేది సోమవారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమంలో బోనాల ఉత్సవాల్లో విషిష్ట సేవలను అందించి పలువురు ప్రముఖులకు శ్రీమహాకాళి మహేష్ గౌడ్ బోనాల ఉత్సవ్ అవార్డ్స్ లను ప్రధానం చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు జి. అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు.


పాతబస్తీ లాల్దర్వాజాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు వంశపాఠ్యంపరంగా ఎందరో అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటారని వారిసేవలను గుర్తిస్తూ శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ బోనాల ఉత్సవ్ అవార్డ్స్ ను ప్రధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు, కులవృత్తులవారికి, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, కళాకారులు, ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, నగరంలోని వివిధ దేవాలయాల అధ్యక్షులకు ఈ అవార్డులను ప్రధానం. చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మెన్ బండ ప్రకాష్, తెలంగాణ శాసన సభ డిప్యూటి స్పీకర్ టి. పద్మారావు, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్ధక సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,

రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సరస్వతీ ఉపాసకులు దైవాజ్ఞ శర్మ, ఎంఎల్సీ ఎంఎస్ ప్రభాకర్, టిఎస్ యూడబ్ల్యు సీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, సింహావాహిని మహాంకాళి దేవాలయం కమిటీ చైర్మెన్ సి. రాజేందర్ యాదవ్ తోపాటు పలువురు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రస్ట్ ప్రధానకార్యదర్శి కె. వెంకటేష్ లతోపాటు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.