కార్పొరేషన్ కు ముందు తర్వాత అభివృద్ధిలో బడoగ్ పేట్ ముందంజ...
నూతన కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో మారిన రూపురేఖలు
ఒక ప్రత్యేక విజన్ తో నియోజకవర్గ సమగ్రాభివృద్ధి.....
ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కాపాడుతూ బాద్యతగా పని చేస్తా
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వర ప్రతినిధి)
కార్పొరేషన్ కు ముందు తర్వాత అభివృద్ధిలో బడoగ్ పేట్ ముందంజలో ఉందని, నూతన కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధికి బాటలు వేస్తూ, 20,21,23,28,31,32, డివిజన్ల పరిధిలో 9 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కృషితో నియోజకవర్గ అభివృద్ధి చేస్తాం. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతితో మారిన రూపురేఖలు మారిపోయాయి. ఒక ప్రత్యేక విజన్ తో నియోజకవర్గ సమగ్రాభివృద్ధి చేపట్టి ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కాపాడుతూ బాద్యతగా పనిచేస్తాం, డివిజన్ ను ఒక ప్రాతిపదికగా తీసుకొని సకల సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. కనీస సౌకర్యాల కల్పన కోసం కార్పొరేషన్ నిధులతో పాటు ప్రభుత్వ ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేపడుతున్నాం.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు,2 మునిసిపాలిటీ లలో 2 కోట్లతో మోడ్రన్ ధోభీ ఘాట్ల నిర్మాణం. చివరి మజిలీ ప్రశాంతంగా జరగాలని మోడ్రన్ వైకుంఠ దామాల నిర్మాణం చేపడుతున్నాం. పట్టణీకరణ పెరిగిపోతుండటంతో అన్ని రకాల కూరగాయలు, మాంసం,వస్తువులు ఒకే దగ్గర దొరికేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం. ప్రతి చోట 4 కోట్లతో బడ౦గ్ పేట్ ,మీర్ పేట్,తుక్కుగూడ,జల్ పల్లి లలో నిర్మాణాలు జరుగుతున్నాయి. పేదల వద్దకే ప్రభుత్వ వైద్యం అందేలా బస్తీ దవాఖానలు,అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు....ఆరోగ్య మహేశ్వరం దిశగా అడుగులు వేస్తున్నాం. తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లు కడుతూ,
నూతన లైన్లు వేస్తున్నాం..భవిష్యత్తు లో నీటి సమస్య తలెత్తకుండా దూర దృష్టితో పకడ్బందీగా చర్యలు. ఆయా కార్పొరేషన్ ల పరుధులలో గల చెరువులను సుందరికరిస్తూ...చిన్న, పెద్దలు ఉదయం,సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద దిరాటానికి,పోటీ పరీక్షల అభ్యర్థులు కసరత్తులు చేయటానికి ఉపయోగపడేలా తీర్చదిద్దుతున్నాం. అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Home
Unlabelled
కార్పొరేషన్ కు ముందు తర్వాత అభివృద్ధిలో బడoగ్ పేట్ ముందంజ... నూతన కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం ,,,పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో మారిన రూపురేఖలు,,,, ఒక ప్రత్యేక విజన్ తో నియోజకవర్గ సమగ్రాభివృద్ధి..... ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కాపాడుతూ బాద్యతగా పని చేస్తా,,,, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: