జానో జాగో వెబ్ న్యూస్ విలేఖరి శ్రీధర్ యాదవ్ పై దాడి

దుండగులపై ఇప్పటివరకు తీసుకొని చర్యలు

దుండగులను కాపాడేందుకు తెరచాటు రాజకీయ ఒత్తిడి

జర్నలిస్టుల రక్షణ చట్టం ప్రయోగించాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్

జర్నలిస్టుపై అకారణంగా దాడి... తెరచాటు రాజకీయ కోణం దాగి ఉందా

దాడి పట్ల భగ్గుమంటున్న జర్నలిస్టు సంఘాలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

తన విధులను నిర్వహించుకొని తిరుగు పయనమవుతున్న జానో జాగో వెబ్ న్యూస్ విలేకరి దాసరి శ్రీధర్ యాదవ్ పై కొందరు దురుకులు అకారణంగా దాడి చేశారు. ఈ ఘటన గత మూడవ తేదీ గడివేముల మండలంలోని గడివేముల బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. గడివేములకు చెందిన కొందరు దుండగులు మద్యం సేవించి  ఆ సమయంలో అటు నుంచి వెళ్తున్న విలేకరి దాసరి శ్రీధర్ యాదవ్ ను పిలిచి డబ్బులు ఇవ్వాలని అడిగి ఆ వెంటనే అతనిపై దాడికి దిగారు. నలుగురు వ్యక్తులు చుట్టుముట్టి విలేకరిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటనతో షాక్ కు గురైన విలేకరి దాసరి శ్రీధర్ యాదవ్ వారి నుండి తప్పించుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.

ఆ సమయంలో స్టేషన్లో ఎస్సై అందుబాటులో లేకపోయారు. విషయం ఫోను ద్వారా ఎస్ఐకి చేరవేయగా తాను వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఫిర్యాదు చేయొచ్చు అని ఎస్సై సూచించారు. దాడి జరిగి మరో రోజు గడిచినా ఎస్సై అందుబాటులోకి రాకపోవడంతో ఫలితం లేదని భావించిన విలేకరి దాసరి శ్రీధర్ యాదవ్ తన కంప్లైంట్ స్వీకరించాలని పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై జిల్లా ఎస్పీకి కూడా మరో కాపీలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దుండగులను రక్షించేందుకు తెరచాటున ఒక రాజకీయ నేత ప్రయత్నం సాగిస్తున్నాడని, ఈ క్రమంలోనే దుండగులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందన్న విషయం కేసు విషయంలో సాగుతున్న చర్యతోనే స్పష్టమవుతోంది. జర్నలిస్టులను దూషించినా, వారిపై దాడికి పాల్పడ్డ కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పోలీసు అధికారులు పరిగణలోకి తీసుకోవాలని బాధిత విలేకరి దాసరి శ్రీధర్ యాదవ్ కోరుతున్నాడు. ఓ జర్నలిస్టుకి రక్షణ లేకపోతే ఇక సామాన్యడి విషయంలో ఏం జరుగుతుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై జర్నలిస్టు సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. దుండగులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాల నేతలు జానో జాగో వెబ్ న్యూస్ విలేఖరి దాసరి శ్రీధర్ యాదవ్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తాము అండగా ఉంటామని అభయం ఇచ్చారు. దుండగులపై చర్యలు తీసుకొని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలు అన్ని ఉద్యమంలో దిగుతాయని వారు హామీ ఇచ్చారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: