ఆన్లైన్ మోసాలతో ఘరానా దోపిడీ......జాగ్రత్తగా ఉండండి

గడివేముల ఎస్ఐ బీటీ. వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని యువత సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని గడివేముల ఎస్సై బిటి.వెంకట సుబ్బయ్య తెలిపారు. వివరాల్లోకి వెళితే గడివేముల మండలంలోని సదాప్ హోటల్ యజమాని షేక్ రసూల్ యజమాని కుమారుడు షేక్షావలి సెల్ నెంబర్ 6300507290 కు గుర్తుతెలియని వ్యక్తులు 02:00 సమయంలో ఆన్లైన్లో బుక్ చేస్తున్నామని, ఫోన్ చేసి మీ పూర్తి వివరాలు తెలియజేయాలని మొదట కేవలం 10/-మాత్రమే ఫోన్ పే చేయాలని అడగడంతో షేక్షావలి పూర్తి వివరాలు తెలపడంతో తన ఖాతాలో ఉన్న మిగతా డబ్బులు 10,000/-క్షణాల్లో నగదును కాజేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీస్ స్టేషన్లో బాధితుడు షేక్షావలి ఆశ్రయించాడు.


వెంటనే స్పందించిన గడివేముల ఎస్సై బీటి. వెంకటసుబ్బయ్య మహిళా పోలీసులు,సహచర సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు లోన్ యాప్ ల ద్వారా చేస్తున్న దోపిడీ గురించి ప్రజలందరికీ తెలియజేసి, గ్రామాలలో దొంగతనాలు,సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: