మహేశ్వరం నియోజకవర్గ పట్టణ ప్రాంత రోడ్లకు మహర్దశ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు నిధుల వరద
హర్షం వ్యక్తం చేస్తున్న మీర్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి, తుక్కుగూడ మునిసిపాలిటీల ప్రజలు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గ పట్టణ ప్రాంత రోడ్లకు మహర్దశపట్టింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు 43 కోట్ల 58 లక్షల 50 వేల నిధులు మంజూరు అయ్యాయి. దీంతో మీర్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి, తుక్కుగూడ మునిసిపాలిటీ ప్రజలు హర్షంవ్యక్తంచేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు సైతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరను ప్రశంసిస్తున్నారు.
ఇదిలావుంటే మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు 62 పనులకు 17 కోట్ల 68 లక్షల యాభై వేలు,జల్ పల్లి మునిసిపాలిటీ లో 56 పనులకు 22 కోట్ల 40 లక్షలు,తుక్కుగూడ మునిసిపాలిటీలో 14 పనులకు 3 కోట్ల 50 లక్షల హెచ్ఎండీఏ నిధులు మంజూరయ్యాయి.
సీసీ, బీటీ రోడ్లతో పాటు పలు చోట్ల రోడ్ల వెడల్పు పనులు కూడా చేపట్టనున్నట్లు మొత్తం 132 పనులు 43.585 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నియోజకవర్గములో అన్ని ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పనకు కృష్జి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి కేటీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Home
Unlabelled
మహేశ్వరం నియోజకవర్గ పట్టణ ప్రాంత రోడ్లకు మహర్దశ... మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు నిధుల వరద,,,, హర్షం వ్యక్తం చేస్తున్న మీర్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి, తుక్కుగూడ మునిసిపాలిటీల ప్రజలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: