ఫాక్స్ కాన్ సంస్థ జిల్లాకు తీసుకొచ్చినందుకు
సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెల్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లాకు మరో మణిహారంగా మారనున్న ఫాక్స్ కాన్ సంస్థ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మక ఎలక్ట్రానిక్ సంస్థ ఏర్పాటు చేసి, ఈ ప్రాంతాన్ని మరో హైటెక్ సిటీగా మార్చబోతున్నందుకు పూల బొకే అందించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సంస్థ ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా యువత తరుపున కూడా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మంత్రితో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్ గారు,తదితరులు ఉన్నారు.
Home
Unlabelled
ఫాక్స్ కాన్ సంస్థ జిల్లాకు తీసుకొచ్చినందుకు ,,,, సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెల్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: