రచయిత ఎన్ సుధీర్ రెడ్డి రచించిన పుస్తకాన్ని,,,
ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యా వేత్త, రచయిత ఎన్ సుధీర్ రెడ్డి రచించిన పుస్తకాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. కాలేజ్ అడ్మిషన్స్ డెకోడెడ్ అనే పుస్తకాన్ని రచయితతో కలిసి మంత్రి మంగళవారం నాడు శ్రీనగర్ కాలనీలోని నివాసంలో ఆవిష్కరించారు. అడ్మిషన్లపై సమగ్రా సమాచారంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా పుస్తకాన్ని రచించిన సుధీర్ ను మంత్రి అభినందించారు. ఇది అందరికీ ఒక దిశ చూపుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేసారు.
రచయిత సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ తో సహా వివిధ పోటీ పరీక్షలకు హాజరైన వారు తదుపరి చేరాల్సిన కోర్సులు,కళాశాలలు లాంటి వివరాలతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవటానికి ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి నరసింహ్మ రెడ్డి, ఎన్ చెన్నారెడ్డి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ టివి రెడ్డి పాల్గొన్నారు.
Home
Unlabelled
రచయిత ఎన్ సుధీర్ రెడ్డి రచించిన పుస్తకాన్ని,,, ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: