సరస్వతి నిలయంగా మహేశ్వరం....

సబితమ్మ మార్క్ పాలనకు ఇది నిదర్శనం....

ఒక్కొక్కటిగా అందుబాటులోకి విద్యా నిలయాలు..

ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య, సాంకేతిక, నైపుణ్య విద్యా కేంద్రంగా మన మహేశ్వరం నియోజవర్గం

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా లో నూతనంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించిన డైట్ కళాశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఒక కోటి 70 లక్షల రూపాయలతో నిర్మించిన మోడల్ స్కూల్ లో అదనపు ఫ్లోర్  ప్రారంభోత్సవంతో పాటు 2 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో కేజీబీవీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ


తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ప్రతిపక్ష  నేతలున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని గురుకులాలల్లో 5 లక్షల మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ విధంగా తయారు కావలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని,ఆ దిశలో మన మోడల్ స్కూల్ విద్యార్థులు నాసా కు ఎంపికవ్వటం పట్ల మంత్రి కేటీఆర్ అభినందించారన్నారు.

గతంలో మోడల్ స్కూల్ లు కేంద్రం నిర్వహించేది, కానీ మోడీ ప్రధాని అయ్యాక వాటి నిర్వహణ నుండి కేంద్రం వెనక్కి వెళ్లగా 190  పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5 వేల మంది విద్యార్థులకు 20 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్ షిప్లు అందించి పేద, మధ్యతరగతి విద్యార్థుల విదేశీ విద్య కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

నేడు అనేక విద్యాలయాలతో మహేశ్వరం విద్య నిలయంగా మారిందన్నారు. కేసీ తండా లో మోడల్ స్కూల్,కేజీబీవీ పాఠశాల,డిగ్రీ కళాశాల, డైట్ కళాశాలతో పాటు శివుని విగ్రహం, చెరువు సుందరికరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్య నాయక్ , సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.







Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: