కనుల పండువగా శివపార్వతుల కల్యాణం

పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు


(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్ పుర శ్రీరామా టాకీస్ సమీపంలో గల శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో బుధవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఉదయం ధాతువ్యాసం. రత్న వ్యాసం, మల్లన్న స్వామి  శివగంగ ప్రతిష్ఠా, పూర్ణాహుతి,  నిర్వహించారు.  భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు నేత్రపర్వంగా జరిగిన శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని కన్నులార తిలకించారు. అనంతరం భక్తులను - అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ పూజా కార్యక్రమాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆలయ ఈఓ పి.మహేందర్ రెడ్డి, సభ్యులు వరెందర్. భారతీయ జనతా పార్టీ నేతలు ఉమామ హేంద్ర, వెంకటాలంచలమ్ ముదిరాజ్, సురేందర్, నరేందర్ పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: