ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ... 

ఉపాధ్యక్షుడిగా ఎస్.పి.క్రాంతి కుమార్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతనగర బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ రెండవ ఉపాధ్యక్షుడిగా ఎస్.పి.క్రాంతి కుమార్ ఎన్నికయ్యారు. రొటేషన్ పద్దతిలో హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరానికి ఈ సంవత్సరం రెండవ ఉపాధ్యక్ష పదవి రావడం ఈ పదవికి ఆలయ కమిటీ తరపున ఎస్.పి.క్రాంతి కుమార్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ కర్యనిర్వహక కార్యదర్శిగా ఎస్.పి.క్రాంతి కుమార్ సేవలందిస్తున్నారు. గత సంవత్సరం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన ఉన్నరు.

ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ తన పేరును రెండవ సారి ఏకగ్రీవంగా ఆమోదించిన ఆలయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల విజయవంతంగా జరుపుటకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: