విద్యా శాఖలో సమూల మార్పులు

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో విద్యా శాఖలో  మార్పులు తీసుకువస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తొలిమెట్టు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లోని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు విన్నూతంగా భోదిస్తూ చేపట్టిన కార్యక్రమం విజయవంతం అయిందని  మంత్రి పేర్కొన్నారు. విద్యా శాఖ అధికారులు, ఉపాద్యాయులు కష్టపడి ఇందులో భాగస్వాములు అయ్యారని వారందరికీ మంత్రి అభినందించారు.  మహేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో  సర్పంచ్ లతో విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఎన్జిఓల సహకారంతో చదువులో వెనుకబడ్డ వారికి స్థానిక చదువుకున్న యువత సహకారంతో చేపట్టనున్న కార్యక్రమంపై అవగాహన కల్పించారు.


విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, విద్యా శాఖ అధికారులు, ఎన్జిఓ సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోన సమయంలో పిల్లలు విద్యకు దూరం అవ్వటంతో వారిలో చదువు పట్ల ఆసక్తి పెరిగేలా నూతన బోధన పద్ధతులతో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించి సత్పలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో చదువులో వెనుకబడిన వారిని స్థానిక సర్పంచ్లు,ఎంపీటీసీలతో ప్రత్యేకంగా గుర్తించి ఆ గ్రామంలోనే చదువుకున్న యువతలో నుండి ఎన్జిఓల సహకారంతో వాలంటీర్లను నియమించి ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో మోడల్ గా మహేశ్వరం లో చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి,

హైదరాబాద్,మేడ్చల్  జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాద్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు,స్థానికంగా చదువుకున్న పూర్వ విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో బాగస్వాములు అయి విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా అంధ్యానాయక్, జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: