టీ తాగేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి

తప్పిపోయిన మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

టీ తాగేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి తప్పిపోయిన సంఘటన కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం కామాటిపుర ప్రాంతానికి చెందిన అస్లంబిన్ అలీ (47) కి కొద్దిరోజులుగా మతిస్థిమితం సరిగా లేదు. ఈనెల 11వ తేదీన టీ త్రాగడానికని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల సమీప ప్రాంతంలో వెతికిన ప్రయోజనం లేకపోవడంతో అస్లంబిన్ అలీ సోదరుడు ముక్రబ్బిన్ అలీ కామాటిపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు  పోలీసులు కేసు నమోదు చేసుకుని తప్పిపోయిన అస్లంబిన్ అలీ కోసం గాలిస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసినవారు కామాటిపుర పోలీసులను సంప్రదించాలని ఎస్సై శంకర్ కోరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: