మహేశ్వరం నియోజకవర్గలోని...

పురాతన దేవాలయాలకు మహర్దశ..

మందిరాల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో విడుదల

 సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు...

సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు...: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గ అతి పురాతనమైన ఆలయాలకు మహర్దశ పట్టనుంది. నియోజకవర్గ కేంద్రంలోని శివగంగా దేవాలయంలో మౌలిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. తుక్కుగూడ మునిసిపాలిటీ ఫాబ్ సిటీ శ్రీ వెంకటేశ్వర ఆలయానికి కోటి రూపాయలు, ఆర్ కె పురం డివిజన్ లోని ఖిలా మైసమ్మ దేవాలయానికి కోటి రూపాయలు, బాలాపూర్ లో గల  వేణుగోపాలస్వామి మందిరానికి కోటి రూపాయలు మంజూరు.*జిల్లెల గూడ శ్రీ వెంకేశ్వర స్వామి గుడికి కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ


రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ధూప,దీప,నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.దేశంలోనే ఎక్కడా లేనివిధంగా యాదాద్రి టెంపుల్ ను పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.నియోజకవర్గంలోని అతి పురాతనమైన దేవాలయాల అభివృద్ధికి కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని 5 ప్రాచీన దేవాలయాల్లో 5 కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన,ఇతర పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: