పరిశ్రమలు తీసుకురావడం అంత ఈజీ కాదు... కేటీఆర్

కేసిఆర్ మన రాష్ట్రనికి శ్రీరామ రక్ష.... మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

పరిశ్రమలు తీసుకురావడం అంత ఈజీ కాదని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొంగరకలాన్ లో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్  సంస్థ  ఫాక్స్ కాన్ కంపెనీ భూమిపూజ లో  మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి,ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఓ పరిశ్రమను కానీ, ఓ సంస్థను కానీ తీసుకురావడం మామూలు విషయం కాదని  అభిప్రాయపడ్డారు. 

ముఖ్యంగా, మోదీ పెట్టే ఇబ్బందులు తట్టుకుని తెలంగాణకు పరిశ్రమలను ఆకర్షించడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో ఐటీ విభాగం, పరిశ్రమల విభాగం ఎంతో పోరాడుతుంటేనే ఒక్కో పరిశ్రమ, సంస్థ రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. 

కష్టసాధ్యమైన పరిస్థితుల్లో కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నామని, అయితే, వచ్చిన కంపెనీలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులపైనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ తొ తెలంగాణకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఫాక్స్ కాన్ సంస్థేనని, మునుపెన్నడూ లేని స్థాయిలో ఫాక్స్ కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు తీసుకువస్తోందని తెలిపారు. ఇంకా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...మార్చి లో ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం జరిగింది. రెండున్నర నేలలలో కంపెనీ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవటంఎంతో సంతోషంగా ఉంది.


తోమ్మిది నేలల్లో పరిశ్రమ కడుతాము అని ఫాక్స్ ప్రతినిధులు చెప్పారు..12 నేలలలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మన కోలువుల తెలంగాణ కావాలి మత పిచ్చి తెలంగాణ వద్దు తెలంగాణ రాష్ట్రం లో కోటి యాబై లక్ష ల వర్క్ పోర్స్ ఉంది. విదేశాలనుండి వచ్చే ఇన్వెస్ట్మెంట్ తో..ఇక్కడ పరిశ్రమలు ఎర్పాటు చేయడం వలన మన దగ్గర ఉద్యోగాలు వస్తున్నాయి.

ఐదు సంవత్సరాల తరువాత ఈ ప్రాంతం గుర్తు పట్టని విధంగా మారుతుంది. నటుడు రజనీకాంత్ హైదరాబాద్ ను అమెరికాను తలపిస్తుంది అని అన్నారు. స్థానిక పిల్లల కోసం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాము. కొత్త తెలంగాణ రాష్ట్రం ఇవాళ జాతీయ స్థాయిలో కొత్త పుత్తలుతోక్కుంది. ఇవాళ ఇంటి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చి..జాతీయ స్దాయిలొ ఆదర్శంగా నిలుస్తుంది. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు 26 అవార్డులు దక్కించుకున్నాయి. పాలమూరు పనులు ఎంత  వేగంగా జరుగుతున్నాయో..


ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గం రైతులకు చూపించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డికి చెప్పాను. రాష్ట్రం బాగుపడుతుంటే బాధపడుతున్న ప్రతిపక్షాలు మన రాష్ట్రంలో నే ఉన్నాయి. పేపర్ లీక్ చేసే దౌర్బగ్యులు ప్రతిపక్షాల నేతలు. స్థిరమైన. ప్రభుత్వం సమర్థ లీడర్ షిప్ తోనే తెలంగాణ అభివృద్ధి. 100 సీట్లతో మళ్లి కేసిఆర్ ని ముఖ్యమంత్రి చేద్దాం. ముఖ్యమంత్రిని కలిసి మెట్రో తెద్దామని అడుగుతున్నారు. సబితా అక్క లాంటి లీడర్స్ కావాలి. అని కేటీఆర్ పేర్కొన్నారు. 

కేసిఆర్ మన రాష్ట్రనికి శ్రీరామ రక్ష.... 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసిఆర్ కి రంగారెడ్డి జిల్లా  ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ మెంట్ ఉన్నా నాయకులు మన మంత్రి కేటిఆర్ అని ఆయన కృషి వలన రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువలా వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మన రాష్ట్రనికి శ్రీరామ రక్ష.. మన ముఖ్యమంత్రికి అండగా నిలబడదామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హైటెక్ సిటికి మించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.










Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: