అంజన్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవ సందర్భంగా...

 బదిరుల ఆశ్రమ పాఠశాలలో పండ్లు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం అంజన్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మలక్ పేట బదిరుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు  పండ్ల పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్ మలక్ పేట నియోజకవర్గం నాయకులు  సిహెచ్ సంతోష్ కుమార్.. నేతృత్వంలో యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బదిర విద్యార్థులందరికీ  పండ్ల పంపిణీ చేశారు.


ఆశ్రమంలోని  విద్యార్థులకు  హెల్త్ కిట్లు పంపిణీ చేశారు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బలహీన వర్గాల నుంచి పార్లమెంట్ స్థాయికి చేరిన అంజన్ కుమార్ యాదవ్  పది కాలాలపాటు ప్రజాసేవలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ వెంకటేష్. .. శశాంక్ సాయి. మారుతి .సిహెచ్ సతీష్ .దిలీప్ .వంశీ సాయి. మగ్గి .తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అంజన్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: