అభివృద్ధికి చిరునామా జల్ పల్లి మున్సిపాలిటీ...

కనీస సౌకర్యాల కల్పనకు కృషి

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు  చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 06,08, 28 లో  66.50 లక్షల రూపాయలతో.. ఉస్మానియా హోటల్ నుంచి ఢిల్లీ దర్బార్ హోటల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణము మరియు వార్డ్ నెంబర్ 03 లో  62 లక్షల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్  సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తాగునీరు, వీధి దీపాలు,రోడ్లు,డ్రైనేజీ పనులతో పాటు,నాలల అభివృద్ధి, చెరువుల సుందరికరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు,మోడ్రన్ వైకుంఠ దామలు నిర్మిస్తున్నటు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మెన్ సాధి, మహేశ్వరం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు కైసర్ బామ్, పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, వర్కింగ్ ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్, మున్సిపాలిటీ స్పోక్స్ పర్సన్ , సయ్యద్ అబ్దుల్ రావుఫ్, ఉపాధ్యక్షులు. సాకీర్ మిర్జా బేగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: