నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం చేయండి

నంద్యాలజిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం చెయ్యాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లాలో 4 వ తేదీన పాణ్యo నియోజకవర్గం కల్లూరు మండలంలోని రేమడురు,5 వ తేదీన  పెదపాడు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించడానికి వస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాద యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా పాణ్యo మండలo మరియు గడివే ముల మండల టీడీపీ కార్యాలయాలలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, లోకేష్ యువగళం పాదయాత్రకు మండలాల నుండి ప్రతి గ్రామం నుండి భారీగా ప్రజలు తరలి వచ్చి యువ గళం పాదయాత్ర విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు పిలుపునిచ్చి


ఆనంతరం టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల ఓటర్ ఐడిలు నెంబర్లు తొలగిస్తున్నారని అందువల్ల ఓటర్ లీస్ట్ లో పేర్లు మరియు ఐడీలు సరిగా వున్నాయో లేదో ఆన్లైన్లో గ్రామల నాయకులు చూసు కోవాలనీ తెలిపారు.


ఈ కార్యక్రమంలో గడివేముల మండల టిడిపి అధ్యక్షులు దేశం సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు సీతారామరెడ్డి, మంచాలకట్టా శ్రీనివాసరెడ్డి, బూజునూర్ రామచంద్రారెడ్డి, మీడియా మహిళా కోఆర్డినేటర్ సుభద్రమ్మ,ఒడ్డు లక్ష్మీదేవి, దుర్వేసి కృష్ణ యాదవ్ గడివేముల,పాణ్యం మండలంలోని వివిధ గ్రామాలలోని టిడిపి నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: