కళ్యాణ లక్ష్మి.. షాది ముబారక్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు అందజేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో తుక్కుగూడ మునిసిపాలిటీ సర్దార్ నగర్ కు చెందిన లబ్దిదారులకు 58,59 జి ఓ ల కింద మంజూరు అయిన భూమి హక్కు పత్రాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణి చేసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పేదింటి అడబిడ్డల పెళ్ళిళ్ళకు ఈ పథకాలు వరం లాంటివి అన్నారు. దేశంలో ఎక్కడలేనివిధంగా తెలంగాణలో మాత్రమే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు.


ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద,మధ్యతరగతి ప్రజలకు 58,59 జి ఓ లతో ఆస్తి హక్కులు కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్దించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 వ తేదీ నుండి నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, సొసైటీ చైర్మన్ పాండు, సర్పంచ్లు, ఎంపీటీసీలు డైరెక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: