తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు జీవితంలో స్థిరపడాలి

సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. వేణుగోపాలరావు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు జీవితంలో స్థిరపడి ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. వేణుగోపాలరావు అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ప్రధాన కార్యాలయంలో సంస్థలో పని చేస్తున్న  ఉద్యోగులు నవీన్ కుమార్ కుమారుడు ప్రతిక్ కుమార్, సిమన్న కుమారుడు గణేష్ కుమార్, కే కవిత కుమార్తే సౌమ్య, రఫియ షహీన్ కుమార్తె మహెర జబీన్, ఓం ప్రకాష్ కుమారుడు వెంకట రామన్, షేక్ ఇస్మాయిల్ కుమార్తె నహిధ్ ఫాతిమా, టీ.నరసింహా కుమారుడు టీ. భానుప్రకష్ లు  వివిధ పరీక్షలలో నెగ్గి ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ ఓం ప్రకాష్,  మేనేజర్ ఎంఏ మోఈజ్,  టీ స్టెప్ మేనేజర్ j జగన్నన్నాతం, సెట్విన్ సూపరింటెండెంట్ టీబీఎస్.ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.


వేణుగోపాలరావు మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించిన అనంతరం వేణుగోపాల్ రావు మాట్లాడుతూ ప్రతిభ గల వారిని సత్కరించి గౌరవిస్తే మరింత ప్రోత్సాహం అందించినట్లవుతుందని అన్నారు. ఇంటర్ విద్యార్థిని సౌమ్య ఎంత వరకు చదవాలనుకుంటే అంత వరకు తానే ఖర్చు భరిస్తామని ప్రకటించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: