సీఎం కేసీఆర్ నేతృత్వంలో...తెలంగాణ రాష్ట్రంలో విద్యకు మొదటి ప్రాధాన్యతచదువుకు మించిన ఆస్తి మరొకటి లేదురాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)విద్యా వ్యవస్థను పటిష్ట పరచాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
నందిగామ మండలం అప్పారెడ్డి గూడలో రూ. 2 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేపట్టారు. అదేవిధంగా షాద్ నగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు గదులకు రూ. 1.55 కోట్లతో శంకుస్థాపన చేశారు. కొందుర్గు మండలం మహాదేవపూర్ లో రూ 15 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు..
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వతముఖాభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు విద్య,వైద్యరంగంలో ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. రాష్ట్రంలో సాగునీటి రంగానికి వ్యవసాయానికి పెద్ద పీఠ వేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి పెద్ద ఎత్తున విద్య అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ఇప్పటికే వెయ్యి గురుకుల పాఠశాలలు, 80 డిగ్రీ గురుకుల కళాశాలలు, 2055 జూనియర్ కళాశాలలు నిర్వహణతో విద్యా అభివృద్ధికి పాటు పడుతున్నట్టు పేర్కోన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమానికి 7 వేల కోట్ల పైచిలుకు నిధులతో వివిధ పనులను ప్రభుత్వం ఎంతో బాధ్యతగా చేపడుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తే విద్యా వ్యవస్థను గొప్పగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని నిధులు వెచ్చించడం జరుగుతుందని మంత్రి అన్నారు. విద్యపై పెట్టేది ఖర్చు లాగా కాకుండా భవిష్యత్తు తెలంగాణకు పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాల ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్యను అందించడం వల్ల గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా పెరిగిందని మంత్రి అన్నారు. ఈ దిశగానే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, మౌలిక సదుపాయాలను కల్పించి నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయని మంత్రి అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా నాణ్యమైన బోధనను బోధించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 100 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ యూనివర్సిటీకి కేటాయించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 3800 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసినట్టు స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో పోటీపడి చదవాలని మంత్రి సూచించారు.ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ నిర్మిస్తున్న భవనాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని,లేనట్లయితే చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నందుకు ధన్యవాదాలు - ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి విద్య అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. తన నియోజకవర్గంలో విద్యకు అవసరమైన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అదేవిధంగా డిగ్రీ కళాశాల అన్ని వసతులతో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. నూతన అదనపు భవనాన్ని నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కళాశాల విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. బాగా చదువుకోవాలని అభినందనలు తెలిపారు. విద్యార్థులతో మంత్రి కరాచలనం చేస్తూ వారితో ఫోటోలు దిగి,బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవలన్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి రాక సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ యువ నాయకులు శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు. యువ నాయకులు గుడ్డు యాదవ్ ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో ఈ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమాలలో జాయింట్ డైరెక్టర్ యాదగిరి, జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
Home
Unlabelled
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో... తెలంగాణ రాష్ట్రంలో విద్యకు మొదటి ప్రాధాన్యత,, చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు,, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,,, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: