రెండుసార్లు ఫోటో విధానాన్ని రద్దు చేయాలి

వ్యాకాస....‌ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని మల్లెం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల దగ్గరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మండల కార్యదర్శి కర్ణ రైతు సంఘం నాయకులు శివమణి,షాహిద్ భాష ఉపాధి కూలీల సమస్యలను అడుగగా వారు ఉపాధి పనులు చేసి నెలలు గడుస్తున్న బిల్లులు రావడం లేదని మరియు రెండు సార్లు ఫోటో తీయడం ఇబ్బందికరంగా ఉందని సమరా అలవెన్స్ లేదని పరా కు చదును చేయించుకోవడానికి డబ్బులు రావడంలేదని పనుల దగ్గర వసతులు లేవని తదితర సమస్యలు వారికి వివరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మండల కార్యదర్శి కర్ణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలను దేశవ్యాప్తంగా కూడగట్టి తిండి అయినాపెట్టాలి,


పనైనా చూపాలి అని పెద్ద ఎత్తున పోరాడిన ఫలితముగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకోవడం జరిగినదని,కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 9 సంవత్సరాల పాలనలో నిత్యవసర సరుకులు పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ,ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ పనిని ఎత్తివేయడానికి రెండుసార్లు  ఫోటో విధానాన్ని  తీసుకువచ్చారని,సమర అలవెన్స్ సవరిస్తూ పనుల దగ్గర వసతులను తగ్గిస్తూ పని చేసినెలలు గడుస్తున్న బిల్లులు మంజూరు చేయకుండా ఇతర వాటికి నిధులు మళ్లిస్తూ ఉపాధి కూలీల కడుపులు కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకొనుటకు సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 15వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఈ ధర్నా కార్యక్రమానికి ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజయవంతం చేయాలని తెలిపారు.కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు పెంచాలని ఆన్లైన్ ద్వారా రెండుసార్లు ఫోటో యాప్ ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని ప్లే షిప్లు ఇవ్వాలని రవాణా చార్జీలు ఇవ్వాలని పనిచేసే చోట గుడారాలు ఏర్పాటు చేసి మెడికల్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని ప్రమాద బీమా కొనసాగించాలని ఉపాధి కూలీలకు కొత్త పనిముట్లు ఇవ్వాలని,జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పిస్తూ ఒక్కొక్కరికి 600 వేతనం ఇవ్వాలని, గ్రామాలలో ఉపాధి కూలీలకు పని కల్పించాలని ఈ సమస్యల పరిష్కారం కొరకు  నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 15 వతేదీన ధర్నా నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమానికి ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రవీంద్ర నరసింహ రంగన్న లచ్చమ్మ యశోద అరుణమ్మ తత్తురు బాబు బాలరాజు నాగన్న పెద్దరాజు శేషన్న మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: