మద్యం మత్తులో స్థానికులపై దుర్భాషలాడిన యువకుడు

అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై దురుసు ప్రవర్తన

అరెస్టు చేసిన పోలీసులు.. శిక్ష విధించిన కోర్టు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

మద్యం మత్తులో ఓ యువకుడు స్థానికులతో దుర్భషలాడుతూ అడ్డువచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కల్గించిన సంఘటన ఆదివారం రాత్రి హుస్సేనీ ఆలంపోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం...ఇంజన్లో ళి ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ (25) ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించి పంచమహాల్లా వద్ద స్థానికులను బెదిరిస్తూ హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న హస్సేనీఆలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇమ్రాన్ ను అడ్డుకోగా పోలీసు పై దురుసుగా ప్రవర్తింస్తూ విధులకు ఆటంకం కల్గించాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకుని తసిరీ చేయగా అతని వద్ద బ్లేడు లభించింది. దీంతో పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. ||ప్రధమ మెట్రోపాలిటన్ ఇన్చార్జ్ మెజిస్ట్రేట్లితా ఇమ్రాన్ కు 30 రోజుల జైలు శిక్షతోపాటు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. ఈసందర్భంగా హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ నరేశ్ మాట్లాడుతూ తమ స్టేషన్ పరిధిలో విచ్చల విడిగా మత్తుపదార్థాలు సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులు కల్గించే వారిపై 63న చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోడ్లపై ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం. అందించాలని ఆయన కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: