స్క్రాప్ గా మారిన ఆటో లను అడ్డగోలుగా అమ్ముకుంటున్న...

రవాణా శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

సిటీ ఆటో, మోటర్  క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహముద్ మక్కి డిమాండ్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

స్క్రాప్ గా మారిన ఆటో లను అడ్డగోలుగా అమ్ముకుంటున్న రవాణా శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ ఆటో, మోటర్  క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహముద్ మక్కి డిమాండ్ చేశారు, సోమవారం అయన కార్యాలయం లో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో అక్తర్ అహ్మద్, జావీద్ ఖాన్ తొ కలసి మాట్లాడుతూ  ఈ నెల మూడవ తేదిన ఖైరతాబాద్ ఆర్ టీ ఏ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారని. 2008 నుంచి 2022 వరకు మొత్తం 80 వేల ఆటోలు తుక్కుగా ఉన్నాయని ఆర్టీఏ రికార్డులు చెబుతున్నాయన్నారు. అయినప్పటికీ ఆ ఆటోలు సైతం రోడ్డుపై తిరుగుతున్నాయని మండిపడ్డారు.


ఈస్ట్ వెస్ట్ జోన్ ల ఆర్టీఏ అధికారులు స్క్రాప్ డీలర్లు కుమ్మక్కై ఆటోలను అక్రమంగా రూ.50వేల నుంచి రూ.70వేలకు విక్రయిస్తున్నారని, ఇప్పటి వరకు దాదాపు 7వేల ఆటోలు రోడ్డుపైకి వచ్చి నట్లు సమాచారం ఉందన్నారు. పేపర్లపై స్క్రాప్ట్ గా చూపించిన ఆటోలను స్క్రాప్ డీలర్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారని, ఇప్పటికే ఆధారాలతో వాటిగురించి అధికారులకు సమాచారం అందించమన్నారు . ఇదే విషయము పై రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్,చీఫ్ సెక్రటరీ,రవాణా శాఖ మంత్రి,జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్, లకు ఆధారాలు సమర్పించినట్లు ఆయన గుర్తు చేశారు. తుక్కుగా పరిగణించిన ఆటోల విషయంలో ఇప్పటి వరకు వంద కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.ఈ కుంబకోణం పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని దింతో అధికారులు ఇష్టాను సారంగా వ్యవహారిస్తున్నారని వెంటనే ఉన్నత అధికారులు. తుక్కు ఆటోల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అధికారులను సస్పెండ్ చేసి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేనిచో ఈ ఆందోళనలో ఆటో, మోటర్ క్యాబ్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో  రవాణా శాఖ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ను ముట్టడి స్తామన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: