బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్  ను

ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం మండలం ఉప్పు గడ్డ తండా గ్రౌండ్ లో 4 వ బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్  ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్రీడాకారులకు అల్ ద బెస్ట్ చెప్పారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, గెలుపు ఓటములు సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ , సర్పంచ్,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కో అపరేటివ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కో అపరేటివ్ భవనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, సొసైటీ చైర్మన్ పాండు, డైరెక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: