మే 2023

 కనుల పండువగా శివపార్వతుల కల్యాణం

పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు


(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్ పుర శ్రీరామా టాకీస్ సమీపంలో గల శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో బుధవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఉదయం ధాతువ్యాసం. రత్న వ్యాసం, మల్లన్న స్వామి  శివగంగ ప్రతిష్ఠా, పూర్ణాహుతి,  నిర్వహించారు.  భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు నేత్రపర్వంగా జరిగిన శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని కన్నులార తిలకించారు. అనంతరం భక్తులను - అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ పూజా కార్యక్రమాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆలయ ఈఓ పి.మహేందర్ రెడ్డి, సభ్యులు వరెందర్. భారతీయ జనతా పార్టీ నేతలు ఉమామ హేంద్ర, వెంకటాలంచలమ్ ముదిరాజ్, సురేందర్, నరేందర్ పాల్గొన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేలా

నూతన క్రీడా పాలసీని ప్రభుత్వం తీసుకొస్తుంది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని ఓటమి గెలుపుకు నాంది అవుతుందన్నారు.  మొదటిసారి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. కసితో ఓటమిని విజయంగా మార్చుకునే శక్తి ఒక క్రీడాకారునికే ఉంటుందన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసారని,  తెలంగాణ క్రీడాకారులు జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా  మట్టిలో మాణిక్యాలను వెలికితీసే విధంగా నూతన క్రీడా పాలసీ రూపొందిస్తున్నట్లు తెలిపారు. విశ్వ వేదికలపై సత్తా చాటుతున్న క్రీడాకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ సముచితమైన రీతిలో ప్రోత్సాహకాలు అందిస్తున్నారని, క్రీడాకారులకు ఇది మరింత ప్రేరణ ఇస్తుందని అన్నారు.  గ్రామాల్లో క్రీడలు ఆడటానికి ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. విజయవంతంగా క్రీడలు నిర్వహించిన అధికారులకు మంత్రి  అభినందించారు. 

గెలుపొందిన క్రీడా కారులకు శుభాకాంక్షలు, ఓడిన వారికి బెస్టాఫ్ లక్ చెప్పారు.  హాకీ లో విన్నర్స్ గా నిలచిన సంగారెడ్డి,రన్నర్స్ నిజామాబాద్ మూడో స్థానం సాధించినహైదరాబాద్ జట్లకు,మహిళల ఫుట్ బాల్ లో  విన్నర్ గా నిలిచిన ఖమ్మం జిల్లా,  రన్నరప్ నల్గొండ, మూడో స్థానం సాధించిన నిజామాబాద్ జట్లకు, ఫుట్ బాల్ బాలురలో మొదటి స్థానం సాధించిన హైదరాబాద్, ద్వితీయ స్థానం లో నిలచిన గద్వాల్ జిల్లా,మూడో స్థానం ఉన్న సంగారెడ్డి జిల్లా జట్లకు మంత్రి బహుమతులు ప్రధానం చేసారు.


 రాజధాని కోపరేటివ్ అర్బన్ బ్యాంకు

నూతన శాఖను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

నిత్యం ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు చేరువులో ఉండే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారంనాడు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తపూర్ వద్ద  రాజధాని కోపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. ఈ నూతన శాఖ ప్రజలకు  చేరువ కావాలని బ్యాంకు అధికార్లకు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి  సబితా ఇంద్రారెడ్డితోపాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 
 బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం కార్యక్రమంలో,,

పాల్గొన్న సీఎం కేసీఆర్... మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్ పల్లి వద్ద విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. ద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి పాల్గొన్నారు. బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారి నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికోసం వొక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్ర ప్రథమం. అన్ని రంగాల మాదిరే బ్రాహ్మణ సంక్షేమంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది.


గోపనపల్లిలోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించిన..విప్రహిత’ బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం  ఉదయం 11.20 గంటలకు ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బయలు దేరారు. నేరుగా యాగశాలకు చేరుకున్నారు. ప్రారంభోత్సవానికి దేశం నలుమూలలనుంచి ఆహ్వానం మేరకు హాజరై ఆసీనులైన పీఠాధిపతుల వద్దకు వెల్లి వారిని పేరు పేరునా పలకరించి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కు వారు కిరీటం ధరింపచేసి, దుశ్శాలువాలు కప్పిసాంప్రదాయ పద్దతిలో శంఖం పూరించి వేదమంత్రాలతో సిఎం కేసీఆర్ కు ఆశీర్వచనాలందించారు. 


 అక్కడనుంచి ప్రాంగణంలోనే మరో పక్కకు ఆసీనులైవున్న వేదపండితుల దగ్గరకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకుని వారి దీవెనలూ సిఎం తీసుకున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానితులుగా వచ్చిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేతలను కలిసి వారితో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుకున్నారు. అనంతరం...ప్రాంగణంలో కొనసాగుతున్న చండీయాగం, సుదర్శనయాగం, వాస్తుపూజ కార్యక్రమాల్లో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. యాగ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న సందర్భంలో.. వేదమంత్రాల నడుమ కొనసాగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. దాంతో నిన్నటి నుంచి కొనసాగుతున్నపూజాకార్యక్రమాలు ముగిసాయి.


అనంతరం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాన్ని సిఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికవద్దకు సిఎం కేసీఆర్ చేరుకున్నారు. ఉదయం 11.35 నిమిషాలకు..తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కెవి రమణాచారి సభను ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కోరగా..సిఎస్ ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమైంది.  అనంతరం ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కేరళకు చెందిన ప్రదీప్ జ్యోతి మాట్లాడారు. దేశంలోనే మరెక్కడాలేని విధంగా అత్యంత గొప్పగా బ్మాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్నఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజ సంక్షేమం పట్ల ఆలోచన చేస్తూ పలు పథకాలను అమలు చేస్తున్న వొకే వొక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారేనని స్పష్టం చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.


అనంతరం సిఎం కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభం సందర్భంగా తన సందేశాన్ని ఇచ్చారు. బ్రాహ్మణలకు వరాల జల్లు కురిపించారు. వేద, శాస్త్ర పండితుల గౌరవ వేతన భృతి రూ. 2500 నుండి రూ. 5000 కు పెంపు చేయనున్నట్లు, వేద, శాస్త్ర పండితుల గౌరవ భృతి పొందే అర్హత వయస్సు 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గింస్తున్నట్లు, మరో 2796 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపుజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల నిర్వహణ కోసం అర్చకులకు అందించే నగదు సహాయం రూ. 6000 నుంచి రూ.10000 పెంపుచేయనున్నట్లు,  వేద పాఠశాలల నిర్వహణ కోసం అందించే రూ. 2 లక్షల అన్యువల్ గ్రాంట్ గా ప్రతి ఏటా విడుదల చేయనున్నట్లు, ఐఐటీ, ఐఐఎం లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం వర్తింపుజేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే అనువంశిక అర్చకుల సమస్యలను శాశ్వత పరిష్కారంచూపుతానని హామీ ఇచ్చారు. సంస్కృత కవి, వ్యాఖ్యాత కొలచల మల్లినాథ సూరి పేరున రాష్ట్రంలోనే తొలి సంస్కృత విశ్వవిద్యాలయం మెదక్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగం ఇలా సాగింది. తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ ఎందరో పేదలున్నారు.


వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’ ను తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న  ఏర్పాటు చేసింది. ఏడాదికి వందకోట్ల రూపాయల నిధులను ‘బ్రాహ్మణ పరిషత్’ కు కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు... ఇప్పటివరకూ 780 మంది విద్యార్థులు  ‘వివేకానంద స్కాలర్షిప్’ ద్వారా ఆదుకోబడ్డారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ (బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్) అనే పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద గరిష్టంగా రూ.5 లక్షల గ్రాంటును ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటివరకూ రూ.150 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ‘విప్రహిత బ్రాహ్మణ సదనం’.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 9 ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా ‘బ్రాహ్మణ సంక్షేమ సదనం’ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ విధంగా ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా ‘బ్రాహ్మణ సదనం’ను నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శిగా, కేంద్రంగా నిలుస్తుంది. 

రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందించబడుతుంది. పేద బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది. కులమతాలకు అతీతంగా పేదవాళ్లు ఎవరైనా సరే తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం నుండి పురోహిత బ్రాహ్మణులు వెళ్లి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని జరిపించి రావాలని నేను కోరుతున్నాను.  ఆ విధంగా విప్రహిత, సకల జనహితగా సమాదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నదే నా వ్యక్తిగత అభిమతం. వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు కావాలని కోరుతున్నాను. ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత, భాగవత, రామాయణాది కావ్య ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి. సూర్యాపేటలో డాక్టర్ ఎ.రామయ్య గారు వదాన్యతతో ఇచ్చిన ఒక ఎకరం స్థలంలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. దీనిని త్వరలోనే ప్రారంభించుకుందామని సంతోషంగా నేను తెలియజేస్తున్నాను. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతంలో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నది. తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన  మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథ సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయాన్ని  తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుందని మీ అందరి హర్షామోదాల మధ్య తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభసందర్భంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 ల నుంచి రూ.5,000 లకు పెంచుతున్నాం.  ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుండి 65 ఏండ్లకు తగ్గిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేధ్యం పథకాన్ని విస్తరింపజేస్తాం. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఇప్పటివరకూ ధూపదీప నైవేధ్యం పథకం కింది దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నాం. ఈ నిర్ణయం మీ అందరినీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను భావిస్తున్నాను. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇస్తాం. ఐటిఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపచేసే నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినేట్ లో చర్చించి పరిష్కరిస్తామని హామీనిస్తున్నాం. సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా వేద పురాణేతిహాసాల విజ్ఞాన సర్వస్వాల ..వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, లోక కళ్యాణకారిగా ‘తెలంగాణ బ్రాహ్మణ పరిషత్’ ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవదేవున్ని ప్రార్థిస్తున్నాను. మీరు నిత్యం పలికే లోకహితకరమైన శాంతి మంత్రంతో నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. అను కేసీఆర్ తన  ప్రసంగాన్ని ముగించారు.  

ఈ కార్యక్రమంలో శాఖపట్టణం శారదాపీఠం నుంచి స్వరూపానందేంద్రస్వామి,  పుష్పగిరి పీఠం నుండి విద్యానృసింహ భారతీస్వామి., మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి సుభుధేంద్ర తీర్థస్వామి., మదనానంద సరస్వతీ పీఠం నుండి మాధవానంద స్వామి, హంపీ విరూపాక్షపీఠం నుంచి విద్యారణ్య భారతీ స్వామి, ధర్మపురి పీఠం నుండి సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, హైద్రాబాద్ కు చెందిన జగన్నాథ మఠం నుంచి వ్రతధర రామానుజ జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత బ్రాహ్మణ పెడరేషన్ నుంచి అధ్యక్షులు ప్రదీప్ జ్యోతి ప్రధానకార్యదర్శి ప్రధమ్ ప్రకాశ్ శర్మ,కోశాధికారి కేశవరావు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలనుంచి వచ్చిన ఫెడరేషన్  ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్, తమిళనాడు,మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్,తదితర రాష్ట్రాలనుంచి వేదపండితులు ఆహ్వానితులుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, వేదపండితుడు మృత్యుంజయ శర్మ, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వొడితెల సతీశ్, బాల్క సుమన్,మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, హైద్రాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి,  అధికారులు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, టిఎన్జీవో మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్, జస్టిస్ భాస్కర్ రావు,మాజీ డిజీపిలు అరవిందరావు, అనురాగ్ శర్మ , అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ, తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి, ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు..డా సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వి మృత్యుంజయ శర్మ, పురాణం సతీష్, మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్, భధ్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాల శర్మ, పరిషత్ సభ్య కార్యదర్శి వి. అనిల్ కుమార్, పాలనాధికారి రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా హాజరైన పీఠాధిపతులను సిఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ముగించుకుని ప్రగతి భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి అనంతరం..చందా నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సముదాయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి ని , ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి మహాస్వామిని మర్యాద పూర్వకంగా కలిసారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు .


 రచయిత ఎన్ సుధీర్ రెడ్డి రచించిన పుస్తకాన్ని,,,

ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యా వేత్త, రచయిత ఎన్ సుధీర్ రెడ్డి రచించిన పుస్తకాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. కాలేజ్ అడ్మిషన్స్ డెకోడెడ్ అనే పుస్తకాన్ని రచయితతో కలిసి మంత్రి మంగళవారం నాడు శ్రీనగర్ కాలనీలోని నివాసంలో ఆవిష్కరించారు. అడ్మిషన్లపై సమగ్రా  సమాచారంతో  విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా పుస్తకాన్ని రచించిన సుధీర్ ను మంత్రి అభినందించారు. ఇది అందరికీ ఒక  దిశ చూపుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేసారు.


రచయిత సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ తో సహా వివిధ పోటీ పరీక్షలకు హాజరైన వారు తదుపరి చేరాల్సిన కోర్సులు,కళాశాలలు లాంటి వివరాలతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవటానికి ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి నరసింహ్మ రెడ్డి, ఎన్ చెన్నారెడ్డి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ టివి రెడ్డి పాల్గొన్నారు.

 పురానాపుల్ డివిజన్ లో పర్యటించిన అసదుద్దీన్ ఓవైసీ

ఎంపీని సన్మానించిన స్థానిక నేత  అభిషేక్ రాజ్ సక్సేనా

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పురానాపుల్ డివిజన్ లో పలు పనులకు శ్రీకారం  చుట్టడంతోపాటు ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైపీ పర్యటిస్తున్నారు. ఈ కక్రమంలో పురానాపుల్ డివిజన్ లో జరిగిన పాదయాత్రలో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీని స్థానిక నాయకులు అభిషేక్ రాజ్ సక్సేనా సన్మానించారు. తన బస్తీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు గానూ అసదుద్దీన్ ఓవైసీ కి అభిషేక్ రాజ్ సక్సేనా ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీని పూలమాలతో సత్కరించారు .

 పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

సంక్షేమంలో, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో  కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత  సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకొందాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించింది, సంక్షేమంలో, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదు...కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉండదు, ఉత్సవాల్లో పోడు పట్టాలు, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్ కిట్లు, హరిత హరం ప్రారంభంతో పాటుగా కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించే కార్యక్రమం చేపడుతున్నాం.

జూన్ 2 నాడు అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని,మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలి. వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలి. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించాలి. సిద్దంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల గ్రంథాలయాలు,1600 డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభిస్తున్నాం. జూన్ 20 నాడు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, డ్రెస్సులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.


పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో  జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు,సాగు నీరు తీసుకురావాటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వాంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలి.ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు,రైతు భీమా,వివిధ రకాల పెన్షన్లు,షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి,చెరువుల్లో వదిలిన చేప పిల్లలు,గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని,అదేవిధంగా పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలి.

ఈ సమావేశంలో కలెక్టర్ హరీష్, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, యెగ్గే మల్లేశం, దయనంద్, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, మునిసిపల్ మేయర్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.


 పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

చేసిన వాగ్దానాలను అమలు చేస్తున్నాం

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రజలకు చెప్పిన వాగ్దానాలను అమలు చేసి చూపెడుతున్నామని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం పురానాపూల్లోపలు అభివృద్ధి పనులను ఆయన ఆ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్, శాసనసభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేం చెప్పిందే చేసి చూపెడుతున్నామని, కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత మజ్లీస్ పార్టీకే దక్కుతుందని ఆయన తెలిపారు. డివిజన్ లో 23 అభివృద్ధి పనులను మూడు కోట్ల మూడు లక్షల నిధులతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.


మురిగీచౌక్ నూతన మార్కెట్ నిర్మాణ పనులు, ఫ్లై ఓవర్లు వంటి పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులు తో పురాణపుల్ డివిజన్ ను అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రహమ్మత్ బాగ్, మజ్లీస్ నాయకులు అనిల్. సుధాకర్ బోటి రాజు, బాబు, రామ్ కుమార్, ,శ్రీనివాస్, ప్రభాకర్, సుధాకర్, అంజాద్, ఇ. అబ్దుల్ రహీం కాలేబ్ బిన్ మాజీద్ తదితరులు పాల్గొన్నారు. 

 శ్రీ దూద్ బౌలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయం...

నూతన కమిటీ ఎన్నిక

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీలో సభ్యత్వం కలిగిన శ్రీ దూద్ బౌలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయం నూతన కమిటీని ఆదివారం  ఎన్నుకున్నారు  దూద్ బోలి ఆర్యవైశ్య సంఘంలో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్గ్ గా దోరేటి ఆనంద్ గుప్తా, అధ్యక్షులుగా వెంకటాచలం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా కట్టా నరసింహారావు ముదిరాజ్,  కోశాధికారిగా సంతోష్ గుప్తా. ముఖ్య సలహాదారులుగా వరకాల యాదగిరి. కట్టా బాలకిషన్ ముదిరాజ్, కల్పగురి శ్రవణ్ కుమార్.


లతోపాటు ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచారి కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ ముదిరాజ్ కార్యదర్శిగా నిరంజన్ కుమార్, మనీష్ గౌడ్ . అధితుల కోఆర్డినేటర్ గా అజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులుగా నవతన్ కుమార్, రాఘవేందర్ ముదిరాజ్, ఎన్ శ్రవణ్ కుమార్.  సి సతీష్ వంశీకృష్ణ.  దయాకర్ .కిరణ్ చారి, రాకేష్ యాదవ్, విట్టల్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 దళారులను నమ్మోద్దు... ఆన్ లైన్లో దారఖాస్తు చేసుకోవచ్చు

జి హెచ్ ఎం సి సర్కిల్-9 అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇర్షాద్  మొహమ్మద్

అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇర్షాద్  మొహమ్మద్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

జి హెచ్ ఎం సి సర్కిల్-9 అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా ఇర్షాద్  మొహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు.  ఇక్కడ ఏసీపీగా పనిచేసిన రాణి కూకట్ పల్లికి బదిలీ కావడం తో కూకట్ పల్లిలో ఏసీపీగా పనిచేసిన ఇర్షాద్ మొహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇర్షాద్ మొహమ్మద్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, తాండూర్ మున్సిపాలిటీలతోపాటు హయత్ నగర్ జి హెచ్ ఎం సి కూకట్ పల్లి, జిహెచ్ ఎం సి కార్యాలయాలలో ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. ఈ సందర్భంగా ఇర్షాద్  మొహమ్మద్ మాట్లాడుతూ సర్కిల్ లైన్ పరిధిలోని హిమ్మత్ పురా, దూద్ బోలి రోడ్డు వైన్డింగ్ పనులను త్వరితగతి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవన నిర్మాణదారుల భవన నిర్మాణ అనుమతుల కోసం సర్కిల్ ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో దళారుల నమ్మవద్దని ఆయన కోరారు. 

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది

కేసీఆర్ త్యాగంవల్లే తెలంగాణ ఏర్పాటు

బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనులు ప్రజలకు తెలియజేయండి

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత  సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో  కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2 నాడు అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి.తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ  చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని,


రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారన్నారు. రాష్ట్రం ఏర్పాటు లాగే వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల  చిరకాల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు,నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు.కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలి.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని,మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలి. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్, తాండూరు లో నర్సింగ్ కాలేజ్, వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో  జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు,సాగు నీరు తీసుకురావాటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.


రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వాంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలి. ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు,షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి,చెరువుల్లో వదిలిన చేప పిల్లలు,  గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పల్లె ప్రగతి  ,పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలి.  ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలి.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి,  కాలే యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కోటిరెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, మునిసిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.


 రేవంత్ రెడ్డిని కలిసిన వేరు కుల సంఘం నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని గాంధీభవన్ లో

తెలంగాణ రాష్ట్ర మేరు  కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మేరు కులస్తులు కె.వెంకటేష్ మేరు,  పోల్కం శ్రీనివాస్, దీకొండ నర్సింగరావు, కె.లక్ష్మీనారాయణ, వొదల శేఖర్, అభినయ్, సూరజ్, నీరజ్, కె.రవిరాజ్, తదితరులు రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు. పనులను త్వరితంగా పూర్తి చేయండి

 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, రెండు మునిసిపాలిటీలలో వెజ్,నాన్ వెజ్ తో పాటు అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర లభించేలా సమీకృత మార్కెట్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.