ఫ్యామిలీ డాక్టర్ల నియామకం అరచేతిలో స్వర్గమే
ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఫ్యామిలీ డాక్టర్ల నియామకం అరచేతిలో స్వర్గమేనని
నంద్యాల జిల్లా ఆవాస్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి విమర్శించారు. ఫ్యామిలీ డాక్టర్ల నియామకంపై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని" ఫ్యామిలీ డాక్టర్"ను నియమిస్తానని చెప్పి కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారని, పథకము మంచిదే అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి భూలోకంలో స్వర్గం చూపించి ప్రజలను మాయమాటలతో మోసం చేసే విధంగా ఉందని, ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏలా అమలు కాలేదో అదే పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ల పరిస్థితి ఉంటుందని,
వ్యాదిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే వర్తిస్తుందని హామీఇచ్చారని, వ్యాధిగ్రస్తులు హాస్పిటల్ కుపోతే ఈ జబ్బుకు చికిత్స చేసేందుకు మాకు అనుమతి లేదని,కొన్ని హాస్పిటల్లో ప్రభుత్వం కోట్ల రూపాయల బకాయి ఉన్నందున మేము చేయలేమంటున్న పరిస్థితి ఉందని,జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కానీ ఫ్యామిలీ డాక్టర్ల నియామకము భూలోకంలో స్వర్గం చూపించినట్లు ఉందిని,నేటికి ప్రాథమిక కేంద్రాల్లో,ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు,నర్సులు, మరియు సిబ్బంది లేరని, మెడికల్ కాలేజీలకు కూడా అనుమతి లేదని, మాయమాటలతోఅరచేతిలో స్వర్గం చూపి ప్రజలను మోసం చేస్తున్నారని ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి ఆవేదన వ్యక్తం చేశారు.
Home
Unlabelled
ఫ్యామిలీ డాక్టర్ల నియామకం అరచేతిలో స్వర్గమే..... ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: