ప్రజలందరికి ప్రభుత్వ ఫలాలను... అందజేసిన ఘనత సీఎం జగన్ ది..... 

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కరి మద్దేల గ్రామంలో పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరుపాడు గ్రామంలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన, ప్రజలందరికీ అందిస్తున్న ప్రభుత్వ ఫలాల గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని,ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గ్రామంలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని, కరిమద్దెల గ్రామంలోని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.


అనంతరం గని గ్రామంలో శివానందరెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉంటున్న ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల జడ్పీటీసీ ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీపీ నాగ మద్దమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, భూపాల్, మధు, రమేష్, శంకర్ రెడ్డి, పరమేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాధమ్మ, బాలచేన్ని, నాగేశ్వర రెడ్డి, బొల్లవరం చంద్ర మౌళీశ్వర రెడ్డి, రాము, సునీల్, రాఘవయ్య, వెంకట కృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి, శివరామిరెడ్డి, పుల్లయ్య, ఎల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రవి, గడివేముల మండల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: