మహేశ్వరం కోర్టు కాంప్లెక్స్ లో...

రెండు నూతన కోర్ట్ భవనాల నిర్మాణాలకు రూ.24 కోట్ల మంజూరు

సీఎం కేసీఆర్... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సధికా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం కోర్టు కాంప్లెక్స్ లో రెండు నూతన కోర్ట్ భవనాల నిర్మాణాలకు రూ.24 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. మహేశ్వరం కోర్ట్ లో న్యాయవాదుల విన్నపం మేరకు న్యాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధుల మంజూరుకు సంభందించి ఉత్తర్వులు వెలువడ్డాయి.నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి,న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: