జనంలోకి విస్త్రుతంగా వెళ్లండి
అందుకు తగ్గ ప్రణాళికలు సిద్దం చేసుకోండి
పార్టీ క్యాలెండర్ మేరకు కార్యక్రమాలు చేపట్టండి
పార్టీ నేతలు, కార్యకర్తలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయడంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాడు రంగారెడ్డి జిల్లాకి చెందిన భారత రాష్ట్ర సమితి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లతో గురువారం నాడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించబోతున్నామని, ఈ సమావేశాల్లో అన్ని స్థాయిల నేతలను భాగస్వాములను చేయాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు.
ఇప్పటికే జిల్లాలో మండల, మునిసిపల్, డివిజన్ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని, అదే విధంగా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు.జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా నిర్వహించిన ఎమ్మెల్యేలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సమ్మేళనాలతో క్యాడర్ లో నూతన జోష్ వచ్చిందని, ఇదే విధంగా పార్టీ క్యాలెండర్ ప్రకారం సూచించిన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలోని లక్షలాది మంది పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి ఆయా నియోజకవర్గాల అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, నామినేటెడ్ సభ్యులు,హాజరుకావాలని, విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విఫ్ అరికెపూడి గాంధీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, పార్టీ సమన్వయ కర్త, శాసన మండలి సభ్యుడు ఎల్. రమణ, శాసన మండలి సభ్యులు వాణీదేవి, బొగ్గారపు దయానంద్, శాసన సభ్యులు జైపాల్ యాదవ్,అంజయ్య యాదవ్, యాదయ్య,డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
జనంలోకి విస్త్రుతంగా వెళ్లండి,,, అందుకు తగ్గ ప్రణాళికలు సిద్దం చేసుకోండి ,,,, పార్టీ క్యాలెండర్ మేరకు కార్యక్రమాలు చేపట్టండి ,,,,పార్టీ నేతలు, కార్యకర్తలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: