పవర్ ఆఫీస్ కు నీళ్లు.... రైతులు కంట కన్నీరు.... 

నందికొట్కూరు బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో రైతన్నలు పండించిన పంటలకు నీరు అందించకుండా పవర్ ఆఫీస్ కు నీరు అందిస్తున్న కేసీ కెనాల్ అధికారులపై  చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ఆఫీస్ కు నీళ్లు వదిలే ప్రదేశంలో నిరసన వ్యక్తం చేస్తూ పాములపాడు మండలంలోని శాంతి నిలయం ఎర్రగూడూరు, బానకచర్ల,వేంపెంట గ్రామాల రైతులు మొక్కజొన్న,మినుము, జొన్న పంటలు వేల ఎకరాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందులకు లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేసి,పంటలు చేతికి అందివస్తాయని సంతోషంగా ఉన్న సమయంలో గ్రామాలలోని రైతులకు కేసీ కెనాల్ అధికారులు వారం రోజులుగా లాకెన్సుల దగ్గర పవర్ ఆఫీసుకు నీరువదిలి,


శాంతి నిలయం దగ్గర తూము తెరవకపోవడంతో రైతులు పండించే పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేసీ కెనాల్ అధికారులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారే తప్ప రైతున్నలను ఆదుకోవడంలో అధికారులు విఫలమయ్యారని,రైతులు వేసిన పంటలు చేతికందాలంటే ఈనెల చివరి వరకు కేసీ కెనాల్ కు నీరు అందిస్తే రైతన్నలు వేసిన పంటలకు ఫలితం ఉంటుందని,రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ నెల చివరి వరకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని లేదంటే కేసి కెనాల్ కింద ఉన్న గ్రామాల రైతులతో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బానకచర్ల బీఎస్పీ నాయకులు వెంకటరమణ, కురుమన్న, రైతులు నాగేశ్వరరావు, వలి, సాంబయ్య, రాజు, చక్రపాణి, మద్దిలేటి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: