"మిషన్ వాత్సల్య"ను... అడ్డుకుని కుట్ర చేస్తున్న కేసీఆర్

అందుకే పథకానికి గైడ్లైన్స్ ఇవ్వడం లేదు

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శ


(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

పేద అనాధ పిల్లల కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీసుకువచ్చిన "మిషన్ వాత్సల్య"11 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకునే కుట్ర చేస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భారత ప్రధాని నరేంద్ర మోడీ  కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందొద్దు అనే అక్కసుతో కెసిఆర్ తన కుళ్ళుకుంతంత్ర రాజకీయ కక్షలను పేద పిల్లలపై కెసిఆర్ చూపియ్యడం సిగ్గు చేటు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, తల్లితండ్రులను కోల్పోయిన పేద పిల్లలకు చేయూతనివ్వడానికి పెద్దన్న లాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల 4000/- రూపాయిలను అందించాలనే ఆశతో ప్రవేశపెట్టిన "మిషన్ వాత్సల్య"

పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించడం కెసిఆర్ రాజకీయ చరిత్రలోనే ఇది అత్యంత దిక్కుమాలిన చర్యగా చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో పాటు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ "మిషన్ వాత్సల్య" పథకాన్ని అమలుపరుస్తుంటే, ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు పరుచకపోవడం మన దురదుష్టకరం. ఈ పథక అమలుతో నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మదిలో పాతుకు పోతారనే ఆలోచనతో, కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర పేద పిల్లల కడుపు కొట్టాలనె తన నీచ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలను కెసిఆర్ తన కుళ్ళు రాజకీయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందనివ్వకుండా తెలంగాణ ప్రజలను నష్టపరుస్తున్నాడని, తెలంగాణ ప్రజలు కెసిఆర్ పాలనతో విస్తుపోయారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రపంచ నాయకుల్లో అగ్రనాయకుడిగా ఎదిగిన గౌ|| శ్రీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీనే శ్రీరామ రక్షా అని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ తెలియజేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: