మంటలు ఆర్పడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే... కఠిన చర్యలు

గడివేముల మండలంలోని రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి

ఎస్సై బిటీ.వెంకటసుబ్బయ్య విజ్ఞప్తి


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలపరిధిలోని గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న గ్రామంలో పొలాలు ఉండి, పంట చేతికి వచ్చిన తరువాత పొలంలో మిగిలిన చెత్తను  మొక్కజొన్న, వరి, పత్తి, మిరప, మినుము మరియు దండల వెంట ఉన్న చిదుగు లకు రైతన్నలు నిప్పుపెట్టి పంట పొలాలను శుభ్రం చేసుకుంటున్నారని, రైతన్న తన పొలంకు నిప్పు పెట్టుకొని శుభ్రం చేసుకుంటున్నారో ఆ రైతన్న దగ్గర ఉండి నిప్పు ఇతర పొలాలకు వ్యాపించకుండా దగ్గర ఉండి నీళ్లతో నిప్పును ఆర్పడంవల్ల ఎలాంటి నష్టం ఉండదని, లేని పక్షంలో రైతన్న అంటించిన నిప్పును ఆర్పకపోతే అది పక్క పొలాలకు వ్యాపించి పంట అంటుకొని నష్టం వాటిల్లుతుందని, రైతులు తమ పొలంలో పెట్టిన నిప్పు ఆరిపోయే వరకు దగ్గర ఉండి నీళ్లతో ఆర్పివేయాలని, ఎవరైనా పొలంలో


నిప్పుపెట్టీ ఆర్పకుండా పక్కన ఉన్న రైతుల చేతికి అందివచ్చిన పంట పొలంకు నష్టం కలిగిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుసోదరులు అందరూ సహకరించాలని గడివేముల ఎసై బిటీ.వెంకటసుబ్బయ్య విజ్ఞప్తి చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: