గులాబీమయంగా మారిన తుక్కుగూడ మునిసిపాలిటీ

బీఆర్ఎస నేతల భారీ ర్యాలీ

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘన  స్వాగతం 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ గులాబీమయంగా మారింది. ఈ మున్సిపాలిటి పరిధిలో బిఆర్ఎస్ పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో మున్సిపాలిటీ అంతా బీఆర్ఎస్ జిందాబాద్ అనే నినాదాలతో దద్దరిల్లింది. తుక్కుగూడో  జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో ఘటన స్వాగతం పలికారు.


భారీ క్రేన్ తో మంత్రి తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి,  పార్టీ జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ ఎల్ రమణకు భారీ పూలదండ వేసిన తుక్కుగూడ మునిసిపాలిటీ బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకొన్నారు.  మహేశ్వరం గడ్డ సబితమ్మ అడ్డా అంటూ ఈ  సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు  చేశారు.  

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: