యువజన విభాగం ఉపాధ్యక్షులుగా అయినవోలు శ్రీకాంత్ రెడ్డి

నియమించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం  ప్రతినిధి)

మహేశ్వరం  నియోజకవర్గ యువజన విభాగం  భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులుగా కందుకూరు మండలం గూడూరు గ్రామానికి చెందిన  అయినవోలు శ్రీకాంత్ రెడ్డిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియమించారు.  ఈ మేరకు శ్రీకాంత్ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో  మహేశ్వరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ముద్దా పవన్ , నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్ , యువజన విభాగం జర్నల్ సెక్రటరీ సుమంత్ రెడ్డి, కందుకూరు మండల యువజన విభాగం అధ్యక్షులు కొలాన్ విగ్నేశ్వర్ రెడ్డి, అక్విల్ మరియు దీక్షిత్ రెడ్డి, యువజన విభాగం ఉపాధ్యక్షులు గొర్రెఇంకల  రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: