జీవోోలతో సహా నిధుల వివరాలు వెల్లడించి

బీజేపీ నేతలకు  పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కౌంటర్

నిధులు తెచ్చినట్లు ఇచ్చిన జీవోలు చూడండి

యూపీ,గుజరాత్ లాంటి ట్రబుల్ ఇంజన్ సర్కార్ కాదిక్కడా....కేసీఆర్ ప్రజా సర్కార్ వుంది

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులేమిటీ అని ప్రశ్నించిన బీజేపీ నేతలకు బీఆర్ఎస్ యువనేత,  జాతీయ మీడియా స్పోక్స్ పర్సన్ పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులేమిటో తెలియజేస్తూ వాటి నిధుల మంజూరుకు జారీచేసిన జీవోలను విడుదల చేసి బీజేపీ నేతల  నోళ్లను మూయించే  ప్రయత్నం చేశారు.  కార్తీక్ రెడ్డి.  సోమవారంనాడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగో మంత్రి తెచ్చిన నిధులు....జీవో లు చూసైనా తెలుసుకో అంటూ బీజేపీ  నేతలకు సవాల్ విసిరారు. జీవో కాపీలను మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  1300 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిచేశాం.  ఇవన్నీ మండల, జిల్లా పరిషత్,మునిసిపల్, సిడిపి,  డీఎంఎఫ్టీతో పాటు రెగులర్ గా వచ్చే ఎలాంటి నిధులు కాదు..ఇవి కేవలం మంత్రి ప్రత్యేకంగా కృషి  తెచ్చిన ప్రత్యేక నిధులు మాత్రమే. మీ యూపీ,గుజరాత్ లాంటి ట్రబుల్ ఇంజన్ సర్కార్ కాదిక్కడా  ఉన్నది....కేసీఆర్ ప్రజా సర్కార్.  అవగాహన లేకుండా మట్లోడొద్దు. మూడు కోట్లు, ఆరు కోట్లు అంటూ ఏ నిధులో తెలువకుండా మట్లోడొద్దు....మళ్ళీ ఆర్ టి ఐ అవసరం లేకుండా చూసుకోవటానికి జి ఓ కాపీల పి డి ఎఫ్ ని పంపుతున్న చూసుకో....ఇందులో ఏ తప్పులున్న మళ్ళీ నియోజకవర్గ రాజకీయాల జోలికి రాను.


 
మీ లాగా సగం వ్యాపారం సగం రాజకీయం కాదు....సబితమ్మ 24 గంటలు పనిచేసేది ప్రజల కోసమే...మహేశ్వరం అభివృద్ధి కోసమే అని గ్రహించాలి.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నయా పైసా ఇవ్వకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో మహేశ్వరం నియోజకవర్గాన్ని ఉహాలకందని విధంగా అభివృద్ధి చేసిన ఘనత మంత్రి సబితా ఇంద్రారెడ్డిది. ప్రజల్లో తిరిగితే సమస్యలు తెలుస్తాయి,పరిష్కారం చేసే వీలుంటుంది.... మీరు చేసేది ఎన్నికల రాజకీయం.  నియోజకవర్గములో విద్యాలయాల బాగు కోసమే 80 కోట్ల నిధులతో పనులు చేప్టటాం. రూ184 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో బడాంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి,తుక్కుగూడ లలో రోడ్లు,సెంట్రల్ లైటింగ్,చెరువుల అభివృద్ధికి నిధులు తెచ్చి పనులు మంత్రి చేయిస్తున్నారు.  ఆర్ అండ్ బి నుండి 432 కోట్లు తెచ్చి రోడ్ల బాగు కోసం ముందున్న మంత్రి. టీఎస్ఐఐసీ ద్వారా 14 కోట్ల 66 లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయటం జరిగింది. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ నుండి  ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరు అందించే కార్యక్రమంలో భాగంగా 331 కోట్ల పై చిలుకు నిధులతో పనులు జరుగుతున్నాయి. టీయూఎఫ్ఐడీసీ ద్వారా 13 కోట్ల 86 లక్షల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.  మహేశ్వరం ఆస్పత్రి ఆప్ గ్రేడ్ కోసం 5 కోట్లు మంజూరు చేయించి,పనులు కోసాగుతున్నాయి.  పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 165 కోట్లతో అభివృద్ధి పనులు. ఎస్ఎన్డీపీ ద్వారా 92 కోట్ల నిధులతో నాళాలు,ట్రంక్ లైన్ల నిర్మాణాల పనులు,వానొస్తే తగ్గిన వరద ముంపు, భవిష్యత్తు లో పూర్తి సమస్య పరిష్కారం చూపాం. అని పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వెల్లడించారు. 





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: