అబ్కి బార్ తెలంగాణ మే బిజెపి సర్కార్

కేంద్ర కేబీనేట్ లో ఓబీసీలకు పెద్దపీట వేసిన ఘటన మోడీకే దక్కుతుంది

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

అబ్కి బార్ తెలంగాణ మే బిజెపి సర్కార్ అని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు. కేంద్ర కేబినేట్ లో అత్యధికంగా ఓబీసీలకు  అవకాశం ఇచ్చిన ఘటన  ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. శుక్రవారంనాడు రాజేంద్రనగర్ నియోజకవర్గ శంషాబాద్ మండల నర్కూడ గ్రామంలో "పల్లే పల్లెకు ఓబీసీ-ఇంటింటికి బిజెపి"  కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్, బీజేపీ  రాష్ట్ర  నాయకులు  బుక్కవేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు లక్ష్మి నారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన బీసీ తరగతులకు చేకూర్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, దేశ వ్యాప్తంగా బీసీ లకు కల్పిస్తున్న అవకాశాల గురించి, తెలియజేశారు.  మోడీ క్యాబినెట్లో అత్యధికంగా మొదటిసారి 27 మంది ఓబీసీ లకు స్థానం కల్పించడం కేవలం బిజెపి ప్రభుత్వానికే సాధ్యమైందని ఆయన వెల్లడించారు. "అబ్కి బార్ తెలంగాణ మే బిజెపి సర్కార్" అని భారత్ మాతా కి జై నినాదంతో బుక్క వేణుగోపాల్ సభా ప్రాంగణాన్ని హోర్తించారు.  పల్లె పల్లెకు ఓబీసీ- ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి అశేషంగా తరలి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీయే శ్రీరామ రక్షగా భావించి కార్యక్రమాన్ని విజవంతం చేసిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు బుక్క వేణుగోపాల్ ప్రత్యేక ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గానటి, అంజన్ గౌడ్, చేవెళ్ల పార్లిమెంట్ ఇంచార్జి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య, జిల్లా ఓబీసీ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, దేపల్లి అశోక్, నంద కిశోర్, వడ్డే చంద్రయ్య, చిటికెల వెంకటయ్య, కొనమొల దేవేందర్, మల్చలం మోహన్ రావు, జితేందర్, లక్ష్మయ్య యాదవ్, బైతి శ్రీధర్, సేవేళ మహేందర్ , సర్పంచ్ సునిగంటి సిద్దులు, ఎంపీటీసీ తొంట గౌతమి అశోక్, వార్డ్ సభ్యులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: