నాపై ఉంచిన నమ్మకం వమ్ముకాకుండా పనిచేస్తా

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బంజారా భవన్ కు నిధుల పట్ల గిరిజన నేతల హర్షం

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలసి ప్రత్యేక ధన్యవాదాలు  తెలిపిన నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీరు నపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని తనను  కలసిన  గిరిజన నేతలతో  విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారంనాడు మహేశ్వరం నియోజకవర్గములో బంజారా భవన్  నిర్మాణానికి 2 కోట్ల నిధులను మంజూరు పట్ల బంజారాలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గిరిజన నేతలు కలిసారు. బుధవారం నాడు నగరంలోని శ్రీనగర్ కాలనిలో మహేశ్వరం నియోజకవర్గ బంజారా నేతలు  బంజారా భవన్ కు నిధులతో పాటు తండాలలో బీటీ రోడ్లకు 9.41 కోట్ల నిధులను మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పిన విధంగా మా గ్రామాల్లో మా పాలన కల సాకారం అయిందని,  నేడు తండాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అండగా ఉన్నారన్నారు .మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో తండాల రూపురేఖలు మారిపోయాయన్నారు.ఈ సందర్భంగా వారు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ మంత్రి వెంటే ఉంటామన్నారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా పనిచేస్తానని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: